ఫటాఫట్… ధనాధన్… సుత్తి కొట్టకుండా స్ట్రయిట్‌గా సమాధానం చెప్పడం రవితేజ స్టైల్! భారతీయ చలన చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపేస్తున్న ‘మీ టూ’ మూమెంట్‌పై తనదైన శైలిలో మాస్ మహారాజ్ ఓ మాట చెప్పారు. కానీ, అందులో బోల్డంత మీనింగ్ వుందండోయ్!
“ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రశాంతంగా వుంది. ‘మీ టూ’ ప్రభావంతో చాలామంది కుదురుకున్నారు. అలా వుండటం మంచిది. అందరూ సెట్ కాక తప్పదు. చాలామందిలో భయం మొదలైంది” అని రవితేజ అన్నారు. ప్రస్తుతం ప్రశాంతంగా వుందని అన్నారంటే.. గతంలో కొన్ని ఘటనలు జరిగాయనే కదా! చాలామందిలో భయం మొదలైందంటే.. తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని భయపడుతున్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు వున్నారన్న మాట.
హిందీ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ‘మీ టూ’ మూమెంట్ కారణంగా పెద్ద పెద్ద ఒర్లు బయటకు వచ్చాయి. శ్రీరెడ్డి ఉదంతం తరవాత తెలుగులో ఇప్పటివరకూ ఒక్క పేరు కూడా బయటకు రాలేదు. వచ్చే అవకాశాలు కూడా కనిపిండం లేదు