మాస్ మహరాజ్ మళ్లీ షూట్ కి రెడీ అయ్యాడు. దిల్ రాజు సినిమా చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయింది.. ఆ అవమాన భారం నుండి కొద్ది కొద్దిగా బయటపడి ప్రస్తుతం తను కమిట్ అయిన సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు రవితేజ. నూతన దర్శకుడు చక్రి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాబిన్ హుడ్ అనే టైటిల్ పెట్టబోతున్నారు. లాస్ట్ ఇయర్ కిక్-2, బెంగాల్ టైగర్ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న రవితేజ వాటి ఫలితాల మీద తీవ్ర నిరాశ చెందాడు.
ఇక ప్రసుతం చేస్తున్న సినిమా మాత్రం కచ్చితంగా హిట్ కొట్టేలా కసితో చేస్తున్నాడు. రంజిత్ మూవీస్ బ్యానర్ లో దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది. ఇక మార్చ్ మొదటి వారం నుండి షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో కథానాయికగా ఎమి జాక్సన్ ను అడిగారట.
కాస్త ఫాం తగ్గిన రవితేజ ఈ సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టి మళ్లీ తన పాత వైభవాన్ని చూపించాలనుకుంటున్నాడు. ప్రస్తుతం రాబిన్ హుడ్ పాత్ర ఎలా ఉంటుందో దానికి కసరత్తులు చేసే పనిలో నిమగ్నమయ్యాడు రవితేజ. మరి కెరియర్ కాస్త అటు ఇటు అనిపిస్తున్న ఈ టైంలో రాబిన్ హుడ్ సినిమా రవితేజ కెరియర్ కు కొత్త ఉత్సాహం నిండే సూపర్ హిట్ సినిమాగా నిలవాలని ఆశిద్దాం.