‘సినిమానే మాట్లాడాలి.. నేను కాదు..’ అనే టైపు రవితేజది. ఆడియో ఫంక్షన్లలో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో.. రవితేజ పెద్దగా మాట్లాడడు. ఇంటర్వ్యూలలో అయితే నోరే మెదపడన్నది పాత్రికేయులు తరచూ చెప్పే కంప్లైంట్. ప్రమోషన్ ఈవెంట్లలోనూ రవితేజ పెద్దగా కనిపించడు. అయితే ధమాకా విషయంలో మాత్రం… పూర్తి భిన్నమైన రవితేజ దర్శనమిస్తున్నాడు. నెల రోజుల ముందు నుంచీ.. విస్త్రృతమైన ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇటీవల ‘ఢీ’ షోకి అతిథిగా వెళ్లాడు రవితేజ. ట్విట్టర్లో.. అభిమానులతో చాట్ చేశాడు. ఈరోజు.. రవితేజ ఫ్యాన్స్ మీట్ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రవితేజ అభిమానులు ఈ మీట్ లో పాల్గొంటున్నారు. రవితేజ ఫ్యాన్ మీట్ పెట్టడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. అంతేకాదు.. బిగ్ బాస్ షోలోనూ రవితేజ సందడి చేయబోతున్నాడు. ఇదంతా తన కొత్త సినిమా ‘ధమాకా’ ప్రమోషన్లకు బాగా ఉపయోగపడుతుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి కూడా భారీగా ప్లాన్ చేయబోతున్నాడు రవితేజ. మొత్తానికి… తను బయటకు వచ్చి మాట్లాడడం, ఈవెంట్స్ లో కనిపించడం తన సినిమాకి ఎంత వరకూ ప్లస్ అవుతుందో రవితేజ అర్థం చేసుకొన్నాడు. అందుకే నిర్మాతలు కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు.