రవితేజ సాధారణంగా ప్రయోగాల జోలికి వెళ్లడు. ఫక్తు కమర్షియల్ కథల్ని ఎంచుకుంటూ, అందులోనే తనదైన ఎంటర్టైన్మెంట్ జోడిస్తూ.. వినోదం పంచేస్తుంటాడు. అయితే వీ ఐ ఆనంద్‌తో చేయబోయే సినిమా మాత్రం ఓ విధంగా ప్రయోగమే అనుకోవాలి. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో ఆకట్టుకున్నాడు వీఐ ఆనంద్. ఇప్పుడు రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. దీనికి ‘డిస్కో రాజా’ అనే పేరు దాదాపుగా ఖరారైంది. కథ చిత్రవిచిత్రంగా ఉండబోతోందట. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ పోషించబోతున్నాడు. తండ్రీ – కొడుకులుగా కనిపించబోతున్నాడు. తండ్రి పాత్రంటే తెల్ల జుట్టు, ముడుతలు పడిన మొహమూ ఇవేం ఉండవు. తండ్రీ కొడుకులు దాదాపుగా ఒకేలా ఉంటార్ట. ఎవరు తండ్రో, ఎవరు కొడుకో తెలిక.. చుట్టు పక్కల పాత్రలు కన్ఫ్యూజ్ అవుతాయట. అదే ఈ కథలో వెరైటీ అని తెలుస్తోంది. నిజానికి ఈకథని అల్లు అర్జున్‌కి వినిపించారు. కానీ.. బన్నీ ఈ టైమ్‌లో ఈ రిస్కు తీసుకోవడానికి సాహసించలేదు. దాంతో… ఈ కథ రవితేజ దగ్గరకు వెళ్లిపోయింది. ప్రస్తుతం శ్రీనువైట్లతో ఓసినిమా చేస్తున్నాడు రవితేజ. అది పూర్తయిన వెంటనే… సంతోష్ శ్రీన్వాస్ సినిమా పట్టాలెక్కుతుంది. దాంతో సమాంతరంగా వీఐ ఆనంద్ సినిమానీ మొదలెట్టేస్తారని సమాచారం.