వైకాపా నేతలకు ఎదురుదాడి చేసే అవకాశమే లేదు. అప్పుడు వాళ్ళు చేశారు…..ఇప్పుడు మేం చేస్తున్నాం అనే మాట ఇంకా దారుణం. రవీంద్ర ఇప్పాల సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా మందికి చేరిపోతున్నాయి. ఆ కామెంట్స్ చదివిన ఎవరికైనా సరే…..అసలు వీడు మనిషేనా అని అనిపించడం ఖాయం. స్త్రీల గురించి రవీంద్ర చేసిన కామెంట్స్ చూస్తూ ఉంటే ఏ స్థాయి మృగమో అర్థమవుతోంది? మహిళా ఎమ్మెల్యేపై చేసిన కామెంట్స్‌ని సోషల్ మీడియాలో కాకుండా నలుగురి మధ్య ఉన్నప్పుడు మాట్లాడితే అందరూ కూడా చెప్పుతో కొట్టడం ఖాయం. ఇక లోకేష్ పైన, చంద్రబాబుపైన ఎంత ద్వేషం అయినా ఉండొచ్చుగాక…..కానీ ఆ ఇంట్లో మహిళల గురించి…..అందునా మాతృమూర్తుల గురించి చేసిన కామెంట్స్ అయితే కచ్చితంగా మానసిక అత్యాచారంగా పరిగణించొచ్చు. ఇప్పుడు డిలీట్ చేసిన ఆ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా జనాలకు చేరుతున్నాయి. వైకాపా అభిమానులు కూడా ఆ కామెంట్స్‌ని తప్పుగానే పరిగణిస్తున్న పరిస్థితి.
సందర్భం వచ్చినప్పుడల్లా అక్కచెల్లెమ్మలకూ….అంటూ గొప్పగా మాట్లాడే జగన్ సమాధానం చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇదే రవీంద్ర ఇప్పాలతో వైఎస్ జగన్ దిగిన ఫొటోలు కూడా నెట్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. అలాగే రవీంద్రకు అండగా ఉంటామని, ఆయన ఖర్చులన్నీ భరిస్తామని వైకాపా నేతలు చెప్పారు. రవీంద్రను గుడ్డిగా సమర్థించారు. మరి ఇప్పుడు అదే రవీంద్ర చేసిన నీచమైన కామెంట్స్ గురించి జగన్ స్పందన ఏంటి? తెలుగు మహిళా జాతి ఉద్ధరణ కోసమే ఉన్నానన్నంత బిల్డప్పులు ఇచ్చే రోజా…..మహిళా ఎమ్మెల్యేపై, మాతృమూర్తి స్థానంలో ఉన్న మహిళపై రవీంద్ర చేసిన నీచపు కామెంట్స్‌ని సమర్థిస్తుందా? టిడిపి వాళ్ళు కూడా చేశారు అని ఎదురుదాడికి దిగే అర్హత ఇప్పుడు వైకాపా నేతలకు లేదు. ఎందుకంటే అలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళను చంద్రబాబు సమర్థించినట్టుగానీ, ప్రోత్సహించినట్టుగానూ ఎక్కడా మనకు కనిపించదు. కానీ జగన్ మాత్రం బాహాటంగా వెనకేసుకొచ్చాడు. టిడిపి మహిళా ఎమ్మెల్యే, టిడిపి అధినేత ఇంట్లో మహిళల గురించి రవీంద్ర చేసిన నీచమైన కామెంట్స్‌ని సమర్థిస్తావా మిస్టర్ జగన్? ఇంత నీచంగా మహిళల గురించి, మాతృమూర్తుల గురించి కామెంట్స్ చేసిన మృగాన్ని సమర్థిస్తూ……..అక్కచెల్లెమ్మలకూ………అంటూ మాట్లాడడంలో అర్థం ఉంటుందా జగన్?