ఊర మాస్ సినిమాలు చేయడంలో పవన్ కల్యాణ్ తో పోటీ పడే నటుడు రవితేజ. మాస్ మహారాజుగా పేరుతెచ్చుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని డిసైడ్ అయ్యాడట. మాస్ హీరోగా ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో నటించాలని రవితేజకు అప్పుడప్పుడూ ఆఫర్లు వస్తుంటాయి. కానీ ఇప్పటి వరకూ ధైర్యం చేయలేకపోయాడు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే ఎలా అనే అనుమానమే దీనికి కారణం కావచ్చు.
ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కల్యాణ్ తొలి ప్రయత్నంలో చేయి కాల్చుకున్నాడు. దీంతో రవితేజ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పవన్ కల్యాణ్ తొలి ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవరాల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ కు నెగెటివ్ టాక్ వచ్చింది. నిర్మాత నష్టపోయాడని స్వయంగా హీరోనే చెప్పాడు. భారీ ధరకు శాటిలైట్ రైట్స్ కొనుక్కుని మా టీవీ వాళ్లు లబోదిబో మంటున్నారట. ఏ రకంగా చూసినా సర్దార్ కు పాజిటివ్ రెస్పాన్స్ కనిపించడం లేదు. ఇంత డిజాస్టర్ సినిమా స్థాయిలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకూడదనేది రవితేజ ఉద్దేశం.
మంచి హిందీ మాట్లాడే రవితేజకు బాలీవుడ్ పై కాస్ మోజు ఉంది. అయితే ఇటీవల వచ్చిన సినిమాల్లోని కొన్ని సినిమాల తరహా స్టోరీ అయితే బెటర్ అనుకుంటున్నాడు. కి అండ్ కా లేదా కపూర్ అండ్ సన్స్ సినిమాల్లాంటి స్క్రిప్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వస్తే ఓకేనట. మంచి కథ, కథనం, ఆసక్తికరమైన టేకింగ్, అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటేనే మంచిదనేది అతడి ఉద్దేశం. కేవలం మాస్ మాస్ అని కలవరించిన పవన్ కల్యాణ్ వ్యూహం భారీగా బెడిసికొట్టింది. సినిమా అనేది అందరూ చూసేది. అందులో మాస్ అని క్లాస్ అని మధ్య రకం అనీ విడదీసి చూస్తే చిక్కుల తప్పవు.
రవితేజకు కూడా మాస్ బ్రాండ్ ఉంది. పచ్చి మాస్ సినిమాలతో పాపులర్ అయ్యాడు. అయినా సరే పవన్ కల్యాణ్ వలె అనాలోచితంగా, తలాతోకా లేని కథతో చలోబాలీవుడ్ అనకూడదని ఇప్పుడు మరింత గట్టిగానే డిసిషన్ తీసుకున్నాడట. పోనీలే…ఒకరు దెబ్బతింటే మరొకరికి పాఠం నేర్పింది. కేవలం మాస్ నే నమ్ముకుంటే నిండా మునిగిపోతారని పవన్ కల్యాణ్ కు తెలియకపో్యినా రవితేజకు మాత్రం బాగానే తెలిసి వచ్చింది. డిజాస్టర్ లోనూ ఓ రకం మెసేజ్ బయటకు వచ్చింది.