ఆ ఆగస్టు 15న ‘మిస్టర్ బచ్చన్’ అంటూ పలకరించబోతున్నాడు రవితేజ. ఆ తరవాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రూపొందించే సినిమాతో బిజీ అయిపోతారు. భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ‘సామజవరగమన’ సినిమాకు రచయితగా పని చేశారు భాను. ఆయన రవితేజ కోసం ఓ కథ రాసుకోవడం, దాన్ని రవితేజ ఓకే చేయడం జరిగిపోయాయి. ఇటీవలే ఈ చిత్రం క్లాప్ కొట్టుకొంది. కొంత మేర షూటింగ్ కూడా జరిగింది.
ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపనున్నారని సమాచారం. సంక్రాంతి లక్ష్యంతోనే చిత్రీకరణ మొదలెట్టారని, ఆ సమయానికి సినిమా పూర్తి చేయడం ఖాయమని సమాచారం. శ్రీలీల ఇందులో కథానాయికగా నటిస్తోంది. ‘ధమాకా’కు సూపర్ హిట్ బాణీలు అందించిన భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 2025 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ చాలా సినిమాలొస్తున్నాయి. అందులో చిరంజీవి, వెంకటేష్ చిత్రాలూ రేసులో ఉన్నాయి. సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది. నాగచైతన్య ‘తండేల్’ టార్గెట్ కూడా ఈ పండగే. ఈ లిస్టులో ఇప్పుడు రవితేజ సినిమా కూడా చేరినట్టైంది.