బెంగాల్ టైగర్ తరవాత రవితేజ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. రెండు మూడు కథలు ఓకే చేసినా.. అదిగో ఇదిగో అని ఊరించినా – ఏవీ వర్కవుట్‌కాలేదు. వరుస ఫ్లాపుల భారాన్ని మోసిన రవితేజ బెంగాల్ టైగర్‌తో కాస్తంత ఊపిరి పీల్చుకొన్నాడు. అందుకే ఈ ఫ్లాపుల నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకొంటున్నాడు. కథ విషయంలో తొందర పడడం లేదు. సినిమా ఆలస్యమైనా… మంచి కథనే ఎంచుకోవాలని పట్టుపట్టుకొని కూర్చున్నాడు. ఈ క్రమంలోనే దాదాపు పది కథలు విన్న రవితేజ… ఇప్పుడు కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇచ్చాడని టాక్. మిరపకాయ్, తఢాకా, రేసుగుర్రం చిత్రాలకు తెర వెనుక పనిచేసిన రచయితలకు విక్రమ్ – దీపక్‌లకు రవితేజ ఛాన్స్ ఇచ్చాడట. వీళ్లిద్దరూచెప్పిన కథ రవితేజకు బాగా నచ్చిందంటే.. వెంటనే ఓకే చేసేశాడని ప్రస్తుతం స్ర్కిప్టు వర్క్ జరుగుతోందని, త్వరలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నల్లమలపు బుజ్జి నిర్మించే అవకాశాలున్నాయి. రవితేజ కొత్త దర్శకుల్ని ఎంచుకొన్నప్పుడల్లా మిశ్రమ ఫలితాలొచ్చాయి. కొందరు హిట్స్ ఇచ్చారు… అయితే అందులో చాలా ఫ్లాపులే. అయినా సరే.. ఈసారీ ధైర్యం చేస్తున్నాడంటే కథలో ఏదో విషయం ఉండే ఉంటుంది. మరి బెంగాల్ టైగర్ ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.