ప్రతీరోజూ పండగే లాంటి సూపర్ హిట్ తరవాత కూడా చాలా గ్యాప్ తీసుకున్నాడు మారుతి. ఈలోగా.. రామ్ కి ఓ కథ చెప్పాడు. అదెందుకో పట్టాలెక్కలేదు. ఆ తరవాత రవితేజతో ఫిక్సయ్యాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా తీయాలి. అన్ని పనులూ అయిపోయాయి. కానీ… ఇప్పుడీ ప్రాజెక్టు డైలామాలో పడింది. రవితేజ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోబోతున్నట్టు టాక్.
కథ నచ్చినా, పారితోషికం విషయంలో తేడాలొచ్చాయని తెలుస్తోంది. ఈ సినిమాకి గానూ రవితేజ 12 కోట్లు డిమాండ్ చేశాడట. యూవీ వాళ్లు 9 ఇస్తామన్నార్ట. కానీ అందుకు రవితేజ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోయాడట. రవితేజ ను 10 కోట్లకు ఒప్పించేందుకు మారుతి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్. అయితే రవితేజ మాత్రం 12 దగ్గరే మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడట. పారితోషికాల దగ్గర రవితేజ చాలా స్ట్రిక్టు. అడిగిందంతా ఇవ్వాల్సిందే. ఆ లెక్కన ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం కష్టమే.
* మరో ఆప్షన్ ఉందా?
మారుతి దృష్టి ఇప్పుడు గోపీచంద్ పై ఉందని టాక్. గోపీచంద్ – మారుతి మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. మారుతితో పనిచేయడానికి గోపీచంద్ ఓకే. రవితేజ కోసం అల్లుకున్న కథ గోపీచంద్ కీ బాగానే సెట్టవుతుందని టాక్. యూవీకి కూడా.. గోపీచంద్ తో ఓ ప్రాజెక్టు చేయాల్సివుంది. సో… రవితేజ కాని పక్షంలో గోపీచంద్ తో ఈ సినిమా ఫైనల్ అవుతుంది.