క్రాక్ సినిమాతో ఓ సూపర్ హిట్ కొట్టాడు రవితేజ. ప్రస్తుతం `ఖిలాడీ` అవతారం ఎత్తాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈలోగా మరో సినిమాకీ పచ్చజెండా ఊపేశాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ కాంబో ఖాయమైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఏఏఏ ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ నటించే 68వ చిత్రమిది. అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభట్ల నిర్మాతలు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కుమార్ బెజవాడ సమకూర్చారు. `ఖిలాడీ` అవ్వగానే.. ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.