రవితేజ – శ్రీనువైట్ల కాంబో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అమెరికాలో షూటింగ్ కాబట్టి.. వీసా వ్యవహారాలు తేలితే గానీ… షూటింగ్ ఎప్పుడన్నది క్లారిటీ రాదు. ఈసినిమా కోసం ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే పేరు పరిశీలనలో ఉంది. టైటిల్‌ని బట్టి… రవితేజ పాత్ర మూడు షేడ్స్‌లలో ఉంటుందని ఈజీగానే ఊహించొచ్చు. కానీ… ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రవితేజ మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేయడం లేదు.. తెరపై ముగ్గురు రవితేజలు కనిపిస్తారని సమాచారం. ఒక్కో పాత్ర చుట్టూ ఒక్కో ట్విస్ట్ ముడిపడి ఉందట. స్వతహాగా తన సినిమాలకు తానే కథ రాసుకుంటాడు శ్రీనువైట్ల. ఈసారి మాత్రం ఓ యువ రచయిత ఇచ్చిన కథకి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది. టైటిల్ కార్డులో ఆ రచయితకు క్రెడిట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. కథలో ట్విస్టులు అద్భుతంగా వచ్చాయని, మరీ ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్.. షాక్ ఇస్తుందని.. టోటల్‌గా చూస్తే శ్రీనువైట్ల ఈ సినిమాతో హిట్టు కొట్టడం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సో… శ్రీనుకి మంచి రోజులు మొదలైనట్టే.