రాయపాటి వైసీపీలోకి వెళ్తున్నారని.. వైసీపీ అధికారిక చానల్స్ లో ప్రసారం అయింది. అది వైసీపీ ఇచ్చిన లీకా లేకపోతే.. రాయపాటి వర్గమే ఇచ్చారో తెలియదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం లైట్ తీసుకున్నారు. ఆయన ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా ఉంటున్నారు. రాయపాటి సాంబశివరావు వయోబారంతో ఉన్నారు. ఆయన వారసులు రాజకీయంగా ప్రభావం చూపే స్థాయికి చేరలేరు. అమరావతి ఉద్యమంలో ఆయన కోడలు చురుకుగా ఉన్నారు. అయితే టిక్కెట్ల కసరత్తులో రాయపాటి కుటుంబం ప్రస్తావనే రావడం లేదు. దీంతో రాయపాటి లీకులిచ్చారు.
రాయపాటి కుమారుడు రంగబాబు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయనకు సత్తెనపల్లి చాన్స్ కూడా వచ్చిది. కానీ ఆ నియోజకవర్గంలో పని చేసిన సందర్భాలు కూడా లేవు. అసలు ఏ నియోజకవర్గంలోనూ ఆ కుటుంబసభ్యులు పని చేయలేదు. దీంతో ఎక్కడా రేసులో లేకుండా పోయారు. వారికి ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా ఇబ్బందేనని చంద్రబాబు కూడా లైట్ తీసుకున్నారు. కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చేరడంతో… ఆయనకు మరింత ఇబ్బంది ఎదురయింది. తనకూ ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుకున్నారు.. కానీ అలాంటి చాన్సేమీ ఉండటం లేదు.
రాయపాటి వెళ్లిపోయినా మంచిదేనని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం.. ఆయన మా పార్టీలో చేరితే ఎలా అని కంగారు పడుతున్నారు ఇప్పుడు పార్టీలో చేర్చుకుని ఏదో ఓ సీటిస్తే పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితేమిటని అంటున్నారు. అయితే వైసీపీలో రాయపాటి చేరరని.. వారు చేర్చుకోరని.. . గుంటూరులో విస్తృతంగా ఓ నమ్మకం ఏర్పడింది.