ఏపీకి తీర ప్రాంతమే బలం. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదేళ్లు వేసిన ప్రణాళికల్ని తర్వాత ఐదేళ్లు నిర్వీర్యం చేశారు. శరవేగంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు కమిషన్ల వేటలో పడి నాశనం అయిపోయాయి. రామయపట్నం పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. కేంద్రం జోక్యం చేసుకుని మౌలిక వసతులు కల్పించాలని ఎంపీ వేమిరెడ్డి తాజాగా కేంద్రాన్ని కోరారు.
రామాయపట్నం పోర్టు సుమారు 850 ఎకరాల విస్తీర్ణంలో.. రూ. 4,902 కోట్ల పెట్టుబడితో ఈ పోర్టును అభివృద్ధి చేయాలని ప ్రణఆళికలు వేశారు. నాలుగేళ్ల పాటు నాన్చి 2022 జూన్ లో ఈ పోర్ట్ నిర్మించేందుకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. భారీ ఓడలను తీరానికి సురక్షితంగా తీసుకుని వచ్చేలా .. 7.87 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ , టర్నింగ్ సర్కిల్స్, అప్రోచ్ ఛానల్ ను నిర్మించారు. పోర్టు నిర్మాణం కోసం కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో ఉన్న మొండివారిపాళెం, ఆవులపాళెం, కర్లపాళెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో తొలిదశలో 850 ఎకరాల భూసేకరణ చేశారు.తొలిదశలో 3,736 కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు బెర్తులు నిర్మించాలనుకున్నారు. దశల వారీగా మొత్తం 19 బెర్తులతో రామాయ పట్నం పోర్టు పూర్తిస్థాయి పోర్టుగా రూపుదిద్దుకోనుండడం మొత్తంగా జిల్లా పారిశ్రామిక ప్రగతికి మేలిమలుపుగా భావించవచ్చు.
Read Also :బెజవాడ ఎయిర్ పోర్టు కళకళ
పోర్టు నిర్మాణం పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలవారికి కూడా పోర్టు ప్రయోజనాలు అందుబాటు లోకి వస్తాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు ఎగుమతులకు రామాయపట్నం పోర్టు ఎంతో కీలకంగా మారనుంది. రామాయపట్నం పోర్టుకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, పరిశ్రమల మౌలిక సదుపాయాలకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే ఈ పనులకు కేంద్రం నిధులు ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. చెన్నై బెంగుళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా కృష్ణపట్నం వద్ద 11,095 ఎకరాల్లో సుమారు 5783 కోట్ల వ్యయంతో త్వరలో క్రిస్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో టెక్స్టైల్స్ పరిశ్రమలు, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, ఎంఎస్ఎంఇ రంగాలకు చెందిన పరిశ్రమలు కూడా రానున్నాయి.
అదేవిధంగా నెల్లూరులో జిల్లాలో సర్వేపల్లి వద్ద క్రిబ్కో `ఆపరేటివ్ లిమిటెడ్ పరిధిలో మరో 560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ చేపట్ట బోతున్నారు. దీంతో రానున్న రోజుల్లో జిల్లాలో పారిశ్రామికా భివృద్ధి వేగవంతమై యువతకు భారీగా ఉద్యో గావకాశాలు కలుగుతాయని ఆశిస్తున్నారు.