రేమండ్ పీటర్ .. ఈ పేరు రాజకీయ వర్గాల్లో చాలా మందికి బాగా పరిచయం. ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. వైఎస్ ఉన్నప్పుడు ఆ కుటుంబంతో బంధుత్వం కలుపుకుని తనకు ఉన్న మాజీ ఐఏఎస్ ట్యాగ్‌తో ఎలాంటి నివేదికలు కావాలంటే అలాంటి నివేదికలకు విలువ కట్టి ఇచ్చే అధికారి. విచిత్రం ఏమిటంటే ఆయనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణిపై ఓ కమిటీ వేస్తే అందులోనూ ఈ పీటర్‌ను చేర్చారు. అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ధరణి విషయంలో ఆయన చేసిన రచ్చ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సమస్యగా మారింది. ధరణిపై రేవంత్ నేతృత్వం లో రివ్యూ మీటింగ్ జరిగింది. ఇందులో పాల్గొన్న రేమండ్ పీటర్ సమావేశం అయిపోగానే తన ఫేస్ బుక్ పేజీని బ్లాక్ లోకి మార్చారు. దీంతో బీఆర్ఎస్ నేతలు వ్యతిరేక ప్రచారం ప్రారంభించేశారు. ఆయన అప్పటికే బీఆర్ఎస్ కు అమ్ముడుపోయి.. ధరణి మంచిదనే రిపోర్టులు రెడీ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇదే రేమండ్ పీటర్ ను జగన్ రెడ్డి 2019లోకి రాగానే చాలా కమిటీల్లో నియమించారు. ముఖ్యంగా పోలవరం నాశనం కావడానికి పీటర్ ను పీటకత్తిలా వాడుకున్నారు జగన్ రెడ్డి. అధికారంలోకి రాగానే జగన్ ఈ రేమండ్ పీటర్ కమిటీని నియమించారు. ఈ రేమండ్ పీటర్.. పోలవరంపై చకా చకా.. పరిశీలన జరిపి … అంతకు ముందు నుంచీ జగన్ చెబుతున్నట్లుగానే… పోలవరం హెడ్ వర్క్స్‌లో రూ. 1362 కోట్ల మేర అక్రమాలు జరిగాయని నివేదిక ఇచ్చారు. అలాగే హైడల్ ప్రాజెక్టు కోసం ముందస్తుగా అడ్వాన్సులు చెల్లించారని కమిటీ పేర్కొంది. కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని సూచించారు. సీఎం ఆదేశించారు. నిబంధనలు చూడకుండా.. అధికారులు జీ హుజూర్ అన్నారు. అనుకున్నట్లుగా రివర్స్ టెండర్ ఇచ్చేశారు.
Also Read : కేసీఆర్‌కు ధరణి – జగన్‌కు టైటిలింగ్ యాక్ట్ !
పీటర్ ఇచ్చిన నివేదికలో చెప్పిన లో రూ. 1362 కోట్ల మేర అక్రమాల ఆధారాలు కావాలని కేంద్రం అడిగితే.. ఆ పీటర్ నివేదికకు చట్టబద్దత లేదని జగన్ సర్కార్ కేంద్రానికి తెలిపింది. అవినీతి జరిగిందని తాము అనుకోవడం లేదని చెప్పింది. ఈ పీటల్ ఈ ఒక్క కమిటీలోనే కాదు అమరావతిని నాశనం చేయాలనుని వేసిన కమిటీలోనూ ఈ పీటర్ భాగస్వామి. ఇంత ఘోరమైన మాజీ అధికారి అని తెలిసి కూడా ధరణి కమిటీలో ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఎలా నియమించిందో కానీ.. ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసేందుకు రెడీ అయ్యారు.