అప్పులు తీసుకోవడం వేరు.. అప్పు కట్టాలని బతిమాలించుకోవడం వేరు.. అదీ బ్యాంకులకు బ్యాంకు అయిన ఆర్బీఐ నుంచి అప్పు కట్టాలని బతిమాలించుకోవడం అంటే… తోపు అన్నట్లే లెక్క. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ హోదా తెచ్చేసుకుంది. ఆర్బీఐ వద్ద వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, ఓవర్ డ్రాఫ్ట్ ల కింద తీసుకోగలిన అప్పు మొత్తాన్ని తీసేసుకుంది. కానీ చెల్లించడం లేదు. గతంలో ఆర్బీఐ ఏపీ ఖాతాలో జమ అయిన మొత్తాన్ని ఆ అప్పులకు జమ చేసుకునేది. కానీ ఇప్పుడు ఏపీ ఖాతాలో ఏమీ జమ కావడం లేదు.
ప్రతి మంగళవారం చేసే అప్పులు కూడా చేయలేకపోతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా .. ఈ నెలది కూడా గత నెలలోనే తీసేసుకున్నారు.మరో వైపు వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌ల కింద తీసుకున్న రుణాలకు చెల్లించాల్సిన గడువు ముగిసిపోయింది. సాధారణంగా ఓవర్ డ్రాఫ్ట్‌ను పధ్నాలుగు రోజుల్లో చెల్లించకపోతే దివాలాగా ప్రకటిస్తారు. కానీ ఆర్బీఐ మాత్రం లే్ఖలు రాస్తోంది. ప్లీజ్ డబ్బులివ్వాలని కోరుతోంది. కానీ ఉంటే ఏదో విధంగా సర్దుబాటు చేస్తారు..
ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు కాబట్టి… సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఆర్బీఐ మళ్లీ రాష్ట్ర ఖాథాలో జమ అయ్యే నిధులను.. సర్దుబాటు చేసుకోవడమే మిగిలింది. వాటి కోసం ఎదురు చూస్తూనే ఉండాలి .. కానీ ప్రభుత్వం మాత్రం తిిగి చెల్లించే పరిస్థితి లేదు. ఇలా చేయడం వల్ల సీఎం జగన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. రాష్ట్ర క్రెడిట్ రేటింగ ్మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. అప్పులు పుట్టుడం కష్టం అవుతుంది.. పుట్టినా అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అయినా అందరూ డోంట్ కేర్.