చెల్లింపుల కోసం యూపీఐ… అప్పు కోసం యూఎల్ఐ… ఆర్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌

డిజిట‌ల్ చెల్లింపుల్లో ఇండియా స‌క్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది. యూపీఐ విధానం వ‌చ్చాక డిజిట‌ల్ చెల్లింపులు చాలా పెరిగిపోయాయి. చిరు వ్యాపారి నుండి అంద‌రూ ఇప్పుడు యూపీఐ పేమెంట్ విధానంలోకి వ‌చ్చిన వారే.

చెల్లింపుల కోసం యూపీఐ తెచ్చిన‌ట్లే… ఇప్పుడు అప్పులు పొందేందుకు యూఎల్ఐ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తామ‌ని ఆర్బీఐ ప్ర‌క‌టించింది. అప్పు అన‌గానే బ్యాంకులు స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు, పేప‌ర్ డాక్యుమెంట్లు అడుగుతుంటాయి. కానీ, ఇక నుండి అప్పులు సుల‌భంగా పొందేలా తీసుక‌రాబోతున్న వ్య‌వ‌స్థే… యూనిఫైడ్ లెండింగ్ ఇంట‌ర్ ఫేస్. అదే యూఎల్ఐ.

దేశంలోని అన్ని భూ రికార్డులు యూఎల్ఐతో అనుసంధానిస్తారు. అవి ఎవ‌రి పేరుతో ఉన్నాయో, వారి వివ‌రాల‌తో స‌హ అటాచ్ చేస్తారు. దీంతో మారుమూల ప‌ల్లెల నుండి ప‌ట్ట‌ణాల వ‌ర‌కు డేటా అంతా యూఎల్ఐతో ఉంటుంది. అప్పుడు ఓ వ్య‌క్తి లోన్ కావాలి అనుకుంటే… దాని ఆధారంగా లోన్ ప్రాసెస్ ను బ్యాంకులు పూర్తి చేస్తాయి. ఫిజిక‌ల్ డాక్యుమెంట్లు పెద్ద‌గా అవ‌స‌రం ఉండ‌దు.

వీటి ద్వారా చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ అనుబంధ లోన్ పొందాల‌నుకునే వారికి సుల‌భంగా తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆర్బీఐ భావిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విధానం పైలెట్ ప్రాజెక్టు ద్వారా ప‌రీక్షించి, ఆచ‌ర‌ణ‌లోకి తీసుకొస్తామ‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ ప్ర‌క‌టించారు. యూపీఐ ఎంత స‌క్సెస్ అయ్యిందో యూఎల్ఐ కూడా అంతే స‌క్సెస్ అవుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close