బీహార్ ఎక్కడ వుంది? ఇండియాలో! హైదరాబాద్ కి ఎంత దూరంలో వుంది? కాస్త అటు ఇటుగా 1500 కిలోమీటర్ల దూరంలో! అయితే… హీరో రామ్ చరణ్, దర్శకుడు బోయపాటి శ్రీను బీహార్ నేపథ్యంలో సన్నివేశాలు తెరకెక్కించడానికి వేల కిలోమీటర్లు ప్రయాణించారు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ బీహార్ నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట! మన దేశంలో వున్న బీహార్ ని వదిలేసి అంత దూరం ఎందుకు వెళ్లారు? అంటే… ఇక్కడ కంటే అక్కడ తీస్తే తక్కువ ఖర్చు అవుతుందట!! రామ్ చరణ్, వివేక్ ఒబేరాయ్ తదితరులు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కీయరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.