ఎర్రవల్లి .. ఈ గ్రామం గురించి తెలంగాణ అందరికీ తెలుసు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది అక్కడే. చాలా మంది రాజకీయనేతలు, సినిమా తారలు మొయినాబాద్ ప్రాంతంలో పామ్ హౌస్ లు కట్టుకుంటారు. లేకపోతే మేడ్చల్ వైపు కట్టుకుంటారు.కానీ కేసీఆర్ మాత్రం.. గజ్వేల్ వరకూ వెళ్లి ఎర్రవల్లి గ్రామంలో కొనుక్కున్నారు. ఆయన ఫామ్ హౌస్ కారణంగా ఆ గ్రామం పేరు మారుమోగపోయింది. అయితే ఇప్పుడు మరో కారణంతో అక్కడ రియల్ భూమ్ ఏర్పడుతోంది. పెద్ద ఎత్తున రియల్ వెంచర్లు పెరుగుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్.. కు ఇంటర్ చేంజ్ జంక్షన్ ఎర్రవల్లి సమీపంలోనే వస్తుంది. జగదేవ్ పూర్ లో జంక్షన్ వస్తుంది. ఈ కారణంగా ఎర్రవల్లితో పాటు ఆ చుట్టుపక్కన ప్రాంతాల్లో రియల్ బూమ్ ఊహించనంతగా పెరుగుతోంది. ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే జగదేవ్ పూర్ సమీపంలోని రుస్తాపూర్, తుర్కపల్లి, వాసాలమర్రి, ఎర్రవల్లి వరకు ఇప్పటికే రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం వాసాలమర్రిలో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 10 వేల నుంచి 20 వేల వరకు ధరలున్నాయి. ఇక జగదేవ్ పూర్ సమీప పరిసర ప్రాంతాల్లో చదరపు గజం 14 వేల నుంచి 28 వేల వరకు ప్లాట్ల ధరలున్నాయి. జగదేవ్ పూర్ సమీపంలోని ఎర్రవల్లిలో భారీ స్థాయిలో ఇప్పటికే ఓపెన్ ప్లాటు వెంచర్లు వేశారు. చదరపు గజం 14 వేల నుంచి మొదలు 24 వేల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ నిర్మాణం ఊపందుకుంటే.. ఇక్కడ ధరలు ఊహించనంతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.