రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం రియల్ ఎస్టేట్ వ్యాపారులను.. సిటీ అవతల వైపు చూసేలా చేస్తోంది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా… ఆయా ప్రాంతాల్లో భవిష్యత్ లో వెంచర్లు వేసేందుకు ఎకరాలకు ఎకరాలు కొనేందుకు బేరసారాలు నడుపుతున్నారు. మన రాజకీయ వ్యవస్థలో రీజనల్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్టు పట్టాలెక్కి.. పూర్తి చేయడానికి కనీసం పది నుంచి ఇరవై ఏళ్లు పడుతుంది. ఇప్పుడు కొని పెట్టుకుంటే అప్పటికి ఊహించనంత రిటర్న్స్ వస్తాయి. ఓఆర్ఆర్ తో ఆ ఫలాలు ఎలా ఉంటాయో చూశారు. అందుకే ఇప్పుడు అందరూ ఆర్ ఆర్ ఆర్ ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ట్రిపుల్ ఆర్ ను మొత్తం 347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయస్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈ భారీ ఇంటర్ ఛేంజర్స్‌తో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్‌కు మంచి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఇంటర్ ఛేంజర్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
ఇపుడు ప్రతిపాదిత రీజన్ల రింగ్ రోడ్ చుట్టూ రోడ్ ఫేసింగ్‌తో ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. కొన్ని చోట్లా ఇంకా ఎక్కువగా ఉన్నాయి. విజయవాడ హైవే.. ముంబై హైవేల వైపు ఉండే ఇంటర్ చేంజర్స్ దగ్గర ఎకరం మూడు కోట్ల వరకూ చేరింది. రహదారి నుంచి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కరం కోటి రూపాయల నుంచి కోటీ 30 లక్షల వరకు ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్న వారంతా కాస్త ధరలు ఊపందుకున్న తర్వాత భారీ వెంచర్లు వేసే అవకాశం ఉంది.