మధ్యతరగతి ప్రజలకు ఇప్పటికీ అందుబాటులో ప్రాంతాల్లో ఇంద్రేశం ఒకటి. పటాన్ చెరు పరిధిలోకి వచ్చే ఈ గ్రామం ఇప్పటికే హైదరాబాద్ లో కలిసిపోయింది. బీరంగూడ, కిష్టారెడ్డి వంటి ప్రాంతాల్లో ధరలు పెరిగిపోవడంతో ఎక్కువ మంది ఇంద్రేశం వైపు చూస్తున్నారు ముంబై హైవేకి దగ్గరగా ఉండటమే కాదు.. ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకునే ఈ గ్రామం ఉంటుంది. దీంతో బిల్డర్లు దృష్టి చాలా కాలం కిందటే దీనిపై పడింది.
ఇంద్రేశంలో పెద్ద ఎత్తున కాలనీలు విస్తరిస్తున్నాయ. చిన్న చిన్న బిల్డర్లతో పాటు నవ్య సంస్థ పెద్ద ఎత్తున వెంచర్లు వేసింది. తాజాగా ఔరో రియాలిటీ సన్సా సిటీ పేరుతో భారీ ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తోంది. అందులో విల్లాలను మూడు కోట్ల నుంచి అమ్ముతున్నారు. అయితే కాలనీల్లో నూట యాభై గజాలలోపు ఇళ్లను చిన్న మేస్త్రీలు కట్టి అమ్ముతున్నారు. అవి 70 లక్షల నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు సమీపంలోనే ఉండటంతో ఎక్కువ మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఇక్కడ ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
నగరం విస్తరిస్తున్న కొద్దీ సమీప గ్రామాలు .. పట్టణంలో భాగంగా మారుతున్నాయి. ఇంద్రేశం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సిటీతో అనుసంధానమయ్యే సూచనలు ఉన్నాయి. ప్రభుత్వం రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. దూరం అనే భావనకు రాకుండా ఉంటే.. ఇంద్రేశంలో ఇల్లు చాలా మంది పెట్టుబడి అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.