గొప్పగా జీవితం సాగిపోతూంటే కొత్త ఏడాది అంత ఉత్సాహంగా అనిపించదు. కానీ కష్టాల నుంచి బయటపడాలని అనుకునేవారికి మాత్రం కొత్త ఏడాది ఉత్సాహంగా అనిపిస్తుంది. 2024లో రియల్ ఎస్టేట్ రంగం కరోనా సమయంలో ఎంత ఇబ్బంది పడిందో అంత ఇబ్బంది పడింది. బడా బిల్డర్లు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొంటున్నారు కూడా. ఇక కొనేవాళ్లు తగ్గిపోవడంతో చిన్న బిల్డర్లు కూడా దెబ్బతిన్నారు.
కొత్త ఏడాదిలోకి రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో కొత్త ఆశలతో అడుగు పెడుతోంది. మొత్తం మారిపోతుందని.. గత ఏడాది జరిగిన నష్టాలన్నీ పోయి..లాభాలు వస్తాయని ఆశ పడుతోంది. వారి ఆశ నిరాశ కాదని.. చెప్పడానికి అవసరమైన పరిణామాలు ఈ ఏడాది వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగ అభివృద్దిని తాత్కాలికంగా కొన్ని పరిణామాలు నియంత్రించవచ్చు కానీ ఎల్లకాలం తొక్కిపెట్టడం సాధ్యం కాదు. అది నిరంతరం పెరుగుతూ ఉండే వ్యాపారం.
అందుకే 2025లో రియల్ ఎస్టేట్ దూకుడు మీద ఉంటుందని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ స్లంప్ కారణంగా రియల్టర్లు ప్రభుత్వానికి ఆదుకోవాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. హోమ్ లోన్ల మీద వడ్డీ రేట్లు తగ్గించడం దగ్గర నుంచి పలు రకాల ప్రోత్సహకాలు కోరుతున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా రియల్ ఎస్టేట్ ఊపందుకోవడం ప్రారంభమవుతుంది. ఈ ఏడాదిలో అంతా మంచే జరుగుతుందని రియల్ ఎస్టేట్ రంగం ఆశాభావంతో ఉంది.