మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్ భూములు వివాదాస్పదంగా మారాయి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఏకశిలా నగర్ వెంచర్ పేదలదని అంటున్నారు. వారు 30 ఏళ్ల క్రితం అంటున్నారు. కానీ ఈ వెంచర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ మా వద్ద ఉన్నాయి.. అన్నీ న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులంటున్నారు.
పోచారం ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండేది. డబ్బులు ఉన్న వాళ్లు స్థలాలు కొనుగోలు చేసి పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు అక్కడ కాలనీలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి సమీపంలో ఉండటం ఔటర్ రింగ్ రోడ్ కూడా అందుబాటులోనే ఉండటంతో ఇక్కడ నివాసాలు పెరుగుతున్నాయి. రోడ్ నెట్‌వర్క్‌లు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలు, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ప్రభుత్వం చురుకుగా ఉంది. ఇంజినీరింగ్ కళాశాలలు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు, స్కూళ్లు అన్నీ ఉన్నాయి.
పోచారంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంటోంది. పోచారంలో ధరలు ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. సిటీకి చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో ఫ్లాట్స్, ప్లాట్లు, ఇళ్లు కొనేందుకు ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది భూముల్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీరిని దృష్టిలో పెట్టుకొనే కొందరు రియల్టర్లు.. ఇక్కడ అపార్ట్మెంట్స్, లేఅవుట్స్ వేస్తుండగా.. ఉన్నత వర్గాల్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొందరు బహుళ అంతస్థుల భవనాలు, విల్లాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. పోచారం టౌన్ షిప్ ఉండటం.. వరంగల్ జాతీయ రహదారి విస్తరణ కారణంగా.. నారపల్లి, పోచారం, అన్నోజిగూడ, యానంపేట, చౌదరిగూడ వంటి చోట్ల ఇళ్లు కొనేవాళ్లు పెరుగుతున్నారు.