విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని మాత్రమే కాదు భవిష్యత్ ఐటీ రంగంతో పాటు అనేక ఇండస్ట్రీలు అక్కడ ఏర్పాటు కానున్నాయి. అదే సమయంలో సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు ఉంది. నగరం వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారి సంఖ్య పెరుగుతోంది. విశాఖతో కాస్త అనుబంధం ఉన్న ఎవరైనా అక్కడ సొంత ఇల్లు ఉండాలనుకుంటారు.
మధ్యతరగతి ప్రజలకు విశాఖ సిటీలో పెట్టుబడి పెట్టడం చిన్న విషయమేం కాదు. ధరలు అలా పెరిగిపోయాయి. శివారు ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉన్న ఇళ్లు, స్థలాలు ఉంటున్నాయి. అలాంటి ప్రదేశాల్లో ఒకటి ఆనందపురం. ఆనందపురం విశాఖపట్నం నుండి సుమారు 20-30 కి.మీ దూరంలో ఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. కానీ సిటీ లక్షణాలు ఇంకారాలేదు. ఇక్కడ చదరపు గజం స్థలం 15,000 రూపాయల లోపు లభిస్తున్నాయి. VUDA , DTCP ఆమోదిత ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంది, సిక్స్-లేన్ హైవే కనెక్టివిటీ ఈ ప్రాంతానికి డిమాండ్ పెంచనుంది.
విశాఖకు ఉన్న ఉజ్వలమైన భవిష్యత్ కారణంగా సిటీకి ముఫ్పై కిలోమీటర్ల వరకూ ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ గా మారింది. వెంచర్లు వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీని బట్టి.. ధరలు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు పెరిగే కొద్దీ వాటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఆయన ప్రాంతాలు పరిశీలనలోకి వస్తే ఇక చెప్పాల్సిన పని లేదు.