రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. వారు ప్రభుత్వాల నుంచి సపోర్టు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు వారు కోరుకుంటున్నారు. కొత్త ఏడాదిలో తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
2024లో రియల్ ఎస్టేట్ రంగం అనుకున్నంతగా ముందడుగు వేయలేదు. వృద్ధి లేకపోగా నాలుగు శాతం వరకూ పడిపోయింది. దీనికి అనేక సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య వడ్డీరేట్లు విపరీతంగా పెంచడం. ద్రవ్యోల్బణం పేరుతో వడ్డీరేట్లు పెంచడంలో హోమ్ లోన్లు సూసైడ్ లోన్లుగా మారిపోయాయన్న ప్రచారం జరిగింది. దీంతో హోమ్ లోన్లు తీసుకుని ఇళ్లు కొనేవారు తగ్గిపోయారు. ఇది అమ్మకాలపై ప్రభావం చూపింది.
ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాదే తగ్గడం. అంతకు ముందు మూడేళ్లు అత్యంత భారీగా పెరిగాయి. కరోనా ఏడాది సహజంగానే అన్ని స్ట్రక్ అయిపోయాయి. 2020 తగ్గిన ఇళ్ల అమ్మకాలు 2021లో71 శాతం పెరిగాయి 2022లో 54 శాతం, 2023లో 31 శాతం పెరిగాయి. అప్పట్లో వడ్డీ రేట్లను బాగా తగ్గించడంతో ఈ అమ్మకాలు నమోదయ్యాయి.
ఇల్లు కొనుగోలు చేసేవారికి ఇస్తున్న పన్ను మినహాయింపులు పెంచాలని కోరుతున్నారు. 80సీ కింద ఇస్తున్న ప్రయోజనాలు పెంచితే ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. అలాగే మరికొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలని కోరుతున్నారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవాడనికి పలు రాయితీలు ప్రకటించాలని రియల్టర్లు కోరుతున్నారు. అయితే రాయితీలు తమకు వద్దని కొనుగోలుదారులకు ఇవ్వాలని వారు కోరడం ఇక్కడ ట్విస్ట్.