రీజనల్ రింగ్ రోడ్ తో హైదరాబాద్ విస్తరణ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఓ భాగానికి టెండర్లు కూడా పిలిచారు. నిర్మాణం వేగంగా పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ పూర్తి అయితే ఎన్నో రియల్ ఎస్టేట్ హాట్ ప్రాపర్టీలు రెడీ అవుతాయి. అలాంటిది కేశంపేట. జడ్చర్ల రోడ్ లో ఉండే కేశంపేట వైపు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి పడింది.
347 కిలోమీటర్ల పొడవున 4 వరుసలతో నిర్మించే రీజన్ల రింగ్ రోడ్ ను గ్రీన్ ఎక్స్ప్రెస్ వేను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండు నుంచి మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వాల లక్ష్యం. శంషాబాద్-జడ్చర్ల రహదారిపై కేశంపేట్ దగ్గర నిర్మించే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల మౌలిక వసతులు ఏర్పాటయ్యే అవకాశముంది. ఇప్పటికే షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందింది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, కేశంపేట్ దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం నివాసాలకు అనుగుణంగా మరింత అభివృద్ది చెందడం ఖాయంగాకనిపిస్తోంది.
ట్రిపుల్ ఆర్ మార్కింగ్ తో కేశంపేట్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇప్పుడు ఎకరం కోటి రూపాయలకు చేరింది. తలకొండపల్లి, బాలానగర్, ఆమన్ గల్ వరకు రియల్ వెంచర్లు వెలిశాయి. కేశంపేట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 15 వేల వరకు ధరలున్నాయి. కాస్త లోపలికి వెళ్తే ఇంకా తక్కువ ధరకు లభిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం ధరలు విపరీతంగా పెరగనున్నాయి.