అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ మీదకు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని ఉసిగొల్పిన వైసీపీ నేతలు… ఇప్పుడు.. అక్కడ పర్మినెంట్ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంత మంది వైసీపీ నేతలు.. రోజు కూలీకి కొంత మంది మనుషుల్ని ఇతర ప్రాంతాల నుంచి తీసుకు వస్తున్నారు. వారందర్నీ శిబిరంలో కూర్చోబెడుతున్నారు . వైసీపీ అనుకూల మీడియాతో మాట్లాడేందుకు కొంత మందికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు.
అయితే.. ఆ ట్రైనింగ్ దీక్షా శిబిరంలోనే ఇస్తూండటంతో వారిలోనే కొంత మంది వ్యక్తులు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఏ ఊరని ఎవరైనా అడిగితే రాజధాని ప్రాంతంలోని బేతపూడి అని చెప్పాలని … ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారని.. ఇళ్ల స్థలాల కోసమే స్వచ్ఛందంగా వచ్చామని చెప్పాలని ట్రైనింగ్ ఇస్తున్నారు. అన్యాయం జరగడం వల్లే రిలే దీక్షలో పాల్గొంటున్నామని చెప్పాలని తాము.. డబ్బులేం తీసుకోలేదని కూడా చెప్పాలని శిక్షణ ఇస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
భూములిచ్చి… రోడ్డున పడిన రైతులు… ఉద్యమాలు చేస్తూంటే… వారిని పెయిడ్ ఆర్టిస్టులంటూ… ప్రభుత్వ పెద్దలు.. మంత్రులు అవహేళన చేస్తూంటారు. ఇప్పుడు వారి స్పాన్సర్స్ షిప్తోనే రియల్ పెయిడ్ ఉద్యమం ప్రారంభమయిదనే సెటైర్లు.. ఈ వీడియో ద్వారా పడుతున్నాయి. ప్రజాభిప్రాయం మార్చడానికి ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారన్న చర్చ మాత్రం సోషల్ మీడియాలో ప్రారంభమయింది.
https://twitter.com/RameshGutta1/status/1319954026448957441