పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ ఓజీ..ఓజీ అని అరవడం కామన్ అయిపోయింది. పవన్ కల్యాణ్ కూడా చిరాకుపడుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ప్రజాపనులను.. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వచ్చారు. అలాంటి సీరియస్ మ్యాటర్లో సినిమాల ప్రస్తావన తీసుకు వచ్చి నినాదాలు చేయడం ఆయనకూ ఇష్టం ఉండటం లేదు.కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు.
పవన్ కు సినిమాల కన్నా రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి అని చాలా సార్లు చెప్పారు. జనం బతుకులు మార్చడానికి చేసే పోరాటం ఆయనకు నచ్చుతుంది. పొట్టకూటి కోసం సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్.. పవన్ కల్యాణ్ స్థాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే సంగతిని మరచిపోతున్నారు. ఆయన స్థాయికి తగ్గట్లుగా ఫ్యాన్స్ కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన కోరుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ పెండింగ్ సినిమాలను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే వాటిపై కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. ఇప్పుడు వాటిని పూర్తి చేయకపోతే చాలా నష్టం వస్తుంది. అత్యంత బిజీ అయినప్పటికీ వీలైనంతగా కాల్ షీట్లు కేటాయించి వాటిని పూర్తి చేసి.. ఆ బాధ్యతల నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌లో ఇక ఫ్యాన్స్ హీరోను చూడటం ఆపేసి.. ఓ రాజకీయ నేతను చూడాలి.. ఓ డిప్యూటీ సీఎంను మాత్రమే చూడాలి. అదే పవన్ కోరుకునేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.