వంశీ జీవితంతో ఆడుకోవాలని వైసీపీ డిసైడయినట్లుగా ఉంది. చేసిన తప్పుడు పనులన్నింటినీ సాక్ష్యాలతో సహ బయట పెట్టేందుకు రెడీ అయింది. ట్రూత్ బాంబు పేరుతో ఆ పార్టీ విడుదల చేసిన సత్యవర్థన్ కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంత అమాయకంగా ఆ స్టేట్ మెంట్ ఉందని…బెదిరించి రాయించినట్లుగా చివరిలో .. తననెవరూ బెదిరించలేదని కూడా చెప్పుకోవడం కామెడీగా ఉందని అంటున్నారు.
సత్యవర్థన్ కు ఫిర్యాదు అని తెలియకపోతే ఇంత కాలం ఎందుకు సైలెంటుగా గా ఉన్నారు ?
తాను చేసింది ఫిర్యాదు అని తెలియదని ఓ టీడీపీ నేత స్టేట్మెంట్ రాసుకువస్తే తాను సంతకం మాత్రమే చేశానని ఆయన చెప్పారు. సాక్షిగా మాత్రమే సంతకం చేశానని కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పుకొచ్చారు. మరి కేసు పెట్టినట్లుగా మీడియాలో వైరల్ అయింది.. అప్పుడు ఆయనకు తెలియదా?. అప్పుడే పోలీస్ స్టేషన్ కు .. కోర్టుకు వచ్చి.. నిజం చెప్పి ఉండాల్సింది కదా అనే డౌట్ వస్తుంది. పైగా తనను ఎవరూ బెదిరించలేదని.. చెప్పుకోవడానికి కారణం ఏమిటో కూడా అందరికీ తెలిసిపోతుంది. దీన్ని ట్రూత్ బాంబు అని వైసీపీ విడుదల చేసింది.
ఫిర్యాదుదారును వంశీ ఎందుకు తీసుకెళ్లాడు ?
సత్యవర్దన్ ను.. వంశీ తీసుకెళ్తున్న దృశ్యాలను రియల్ ట్రూత్ బాంబు పేరుతో రిలీజ్ చేసింది. ఓ ఫిర్యాదుదారును నిందితుడు తీసుకెళ్లడం తీవ్రమైన నేరం. చిన్న నేరం కాదు. తీసుకెళ్లి అతనితో తప్పుడు స్టేట్ మెంట్ ఇప్పించి కేసు నుంచి బయటపడిపోదామనుకున్నాడు. ఇది రియల్ ట్రూత్ అని టీడీపీ ఏకంగా దృశ్యాలను విడుదల చేసింది. అయితే ఇది శాంపిలే. కోర్టులో ప్రవేశ పెట్టే సాక్ష్యాలు వంశీ ట్రూత్ ఫేస్ ను బయట పెడతాయని చెప్పవచ్చు.
ఏం వివాదం రేగితే వంశీ అంతగా ఇరుక్కుపోతాడు !
ఈ వ్యవహారంలో నిజాలు ఎంతగా బయటకు వస్తే వంశీ అంతగా ఇరుక్కుపోతాడు. ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసి బెదిరించాడన్న కేసులో అరెస్టు అయితే.. వైసీపీ సోషల్ మీడియా గన్నవరం టీడీపీ ఆపీసుపై దాడి కేసులో అరెస్టు చేశారన్నట్లుగా ప్రచారం చేస్తోంది. అంటేనే.. ఈ కేసులో వంశీ ఎలా ఇరుక్కుపోయాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎంత కాలం జైల్లో ఉన్నా.. తమ పార్టీకి మైలేజీ రావాలని వైసీపీ ప్లాన్ ఇక్కడే స్పష్టమవుతోంది.