రామ్ చరణ్- సుకుమార్ కలయికలో ఓ సినిమా తెరక్కెక్కనుంది. నిన్ననే ఈ చిత్రానికి కొబ్బారికాయ్ కొట్టారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం వుంది. మొదట రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ లను అనుకున్నారు. మరి ఇంతలో ఏమైయిందో గానీ అనుపమ పరమేశ్వరన్ ను డ్రాప్ చేసేశారు. ఆస్థానంలో సమంతను ఎంపిక చేశారు.
అయితే ఇప్పుడీ విషయంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న భిన్న కధనాలు ఆసక్తికరంగా వున్నాయి. అనుపమ హఠాత్తుగా పారితోషికం పెంచేసిందని, అది నిర్మాతలకి కిట్టక ఆమెను పక్కన పెట్టేశారని ఓ గాసిప్ వినిపించింది. తాజాగా ఇంకోటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. అనుపమ పరమేశ్వరన్ మెగా ఫ్యామిలీకి నచ్చలేదట. తాజాగా మెగా ఫ్యామిలీ మొత్తం ‘శతమానం భవతి’ సినిమాను చూసిందట. ఆ సినిమాలో అనుపమను చూసి వారు ఇంప్రెస్ అవలేదట. చరణ్ పక్కన చిన్న పిల్లలా కనబడుతుందని అందరూ ఫీల్ అయ్యరట. దీంతో ఆమెను పక్కన పెట్టేసి సమంతను ఎంపిక చేశారట.
ఇదేదో విచిత్రమైన ఓపినియన్ లా అనిపిస్తుంది. చరణ్ పక్కన చిన్నపిల్లలా కనిపిస్తుందని బావిస్తున్నారంటే .. చరణ్ అంత ముదిరిపోయాడని అనుకోవాలా? చరణ్ కంటే ముందుగా ఇండస్ట్రీలో కి వచ్చిన నితిన్ తో జతకట్టింది అనుపమ. అక్కడివరకూ ఎందుకు చరణ్-శర్వానంద్ క్లాస్ మేట్స్. శర్వానంద్ చక్కగా సరిపోయింది అనుపమ. అలాంటిది చరణ్ పక్కన ఎలా చిన్నపిల్ల అయిపోతుంది?ఏంటో.. ఎవరో కావాలనే ఈ గాసిప్ పుట్టించినట్లు వుంది. అసలు నిజం మాత్రం చిత్ర బృందానికే తెలుసు.