విశాఖ మన్యంలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను అత్యంత దారుణంగా హత్య చేసిన మావోయిస్టులు.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడైనా.. ఏదైనా సంచలనాత్మక ఘటన చేపడితే.. మావోయిస్టులు ఘనంగా చెప్పుకుంటారు. ఎందుకు చేశామో కూడా చెబుతారు. 90 శాతం ఘటనల్లో… లేఖలు విడిచి పెట్టి వెళతారు. తాను చేసిన పనికి కారణాలేమిటో కూడా.. అందులో చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను చంపిన తర్వాత ఇది మా పనేనని.. వాళ్లు ఫలానా తప్పు చేశారని మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదు. ఏ దళమూ… తమ ఘనతేనని చెప్పుకోలేదు.
ఇదే పోలీసుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పైగా… కిడారి సర్వేశ్వరరావును.. కాల్చే ముందు… తెలుగుదేశం పార్టీలోకి మారేందుకు ఎంత తీసుకున్నావని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కిడారి డ్రైవర్ను కూడా మావోయిస్టులు అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పార్టీ మారినప్పుడు ఎంత తీసుకున్నారో తెలుసా అని ఓ సాధారణ వైసీపీ కార్యకర్త అడిగినట్లు అడగడం పోలీసు వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. ఓ వైపు ముసురుకుంటున్న అనుమాలకు కోడు.. మావోయిస్టులు ఎందుకు దీన్ని క్లెయిమ్ చేసుకోవడం లేదని మరో ప్రశ్న. మావోయిస్టులు అన్ని రాజకీయప పార్టీలను ఒకేలా చూస్తారు.. ఓ పార్టీపై ప్రత్యేకమైన అభిమానం అంటూ చూపరు. కానీ.. కిడారి, సోమల హత్యల విషయంలో మాత్రం.. కొంచెం తేడా కనిపిస్తోంది. మావోయిస్టులు అగ్రనేతలంకా దాదాపుగా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. వారిలో కుల పిచ్చి పెరిగిపోయిందనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో కొన్ని రాజకీయపార్టీలతోనూ.. వీరికి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణగానే కిడారి సర్వేశ్వరరావు పార్టీ మార్పుపై… మావోయిస్టులు పదే పదే ప్రశ్నలు సంధించారనే అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో కిడారిని, సోమను లిపిటిపుట్టు గ్రామానికి పిలిపించింది కూడా స్థానిక వైసీపీ నేతేనన్న ప్రచారం కూడా ఉద్ధృతంగా సాగుతోంది. అదే సమయమంలో జగన్ మీడియా… కిడారి, సోమ ఇద్దరూ మైనింగ్ చేస్తున్నారనే ప్రచారం కల్పించడానికి ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి వారిద్దరికీ ఎలాంటి మైనింగ్ వ్యాపారాలు లేవు. ఆ విషయం అక్కడి గిరిజనలుకు తెలుసు. సివేర సోమ ఎమ్మెల్యేగా కూడా చేశారు. కానీ ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి.. జాలిపడని వారు లేరు. ఇన్ని రోజులైనా మావోయిస్టులు ప్రకటన చేయకపోవడం… పెద్దగా ఆరోపణలు లేని .. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చడం వెనుక..మావోయిస్టుల పార్టీలోనే అభిప్రాయ బేధాలున్నాయని భావిస్తున్నారు.