ఈ దసరాకి రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ & టైటిల్ రెండూ బయటకు వచ్చేస్తాయని గంపెడాశలు పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. వాళ్ల ఎదురుచూపులు ఫలించలేదు. దసరాకి రామ్ చరణ్ & టీమ్ ఎలాంటి హడావుడీ చేయలేదు. దాంతో చరణ్ అభిమానులు నీరసపడిపోయారు. `ఇలా చేశాడేంటి బోయపాటి` అంటూ ట్విట్టర్లలో తమ నిట్టూర్పులు వినిపిస్తున్నారు. ఈ సినిమాకి `వినయ విధేయ రామ` అనే టైటిల్ ఖాయమైపోయింది. ఆ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌నీ పండక్కి విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. టైటిల్ లోగో డిజైన్ పట్ల బోయపాటి అసంతృప్తితో ఉన్నాడట. తనకు నచ్చినట్టు లోగో తీర్చిదిద్దినప్పుడే ఈ టైటిల్‌ని విడుదల చేయాలని ఫిక్సయ్యాడని టాక్. టైటిల్‌తో పాటు లుక్‌నీ విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే లుక్‌నీ దాచిపెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా టైటిలేంటన్నది ఇప్పటికే జనాలకు తెలిసిపోయింది. ఇక దాచి ఉపయోగమేముంది?? కానీ ఆ టైటిల్‌ని లోగోతో సహా విడుదల చేయాలన్నది బోయపాటి ప్లాన్. తానేమో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తనకు నచ్చినంత వరకూ సినిమాని దిద్దుతూనే ఉంటారు. ఆఖరికి లోగో విషయంలోనూ రాజీ పడకపోవడంతో ఈ దసరాని ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వకుండా చప్పగా సాగనంపేశారు.