డొనాల్డ్ ట్రంప్ ప్రచారం చేస్తున్న దాని కంటే ఎక్కువగా టెస్లా, స్పేస్ ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ రిపబ్లికన్ల కోసం ప్రచారం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే తప్ప అమెరికా బాగుపడని లేకపోతే నాశనమైపోతుదని బెదిరిస్తూ ఆయన ప్రచారం సాగుతోంది. ఓట్ల లెక్కలు చెబుతూ పిట్ట కథలు చెబుతూ ఆయన చేస్తున్న హడావుడి చూసి చాలా మంది మస్క్ ఏదో పెద్ద ప్లాన్ లో ఉన్నారని అనుకుంటున్నారు. వీరి అనుమానాలను నిజం చేస్తే మరో ప్రపంచ కుబేరుడు అమెజాన్ చీఫ్… జెఫ్ బెజోస్ క్విడ్ ప్రో కో చేయలేనని తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించాడు.
అంటే ఎవరికైనా మద్దతు ఇచ్చి వారి ప్రచారానికి సాయం చేస్తే.. తదుపరి ఏదో ఆశిస్తారన్నమాట. ట్రంప్ ఏమి ఆశిస్తారన్నదానిపై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన చిన్న చిన్న ఆశలు పెట్టుకోరని.. ఆయన అంచనాలన్నీ ఆకాశంలోనే ఉంటాయని .. ఆయన టార్గెట్ స్పేస్ ను క్యాప్చర్ చేయడం అని అంటున్నారు. అది ట్రంప్ వస్తేనే సాధ్యమవుతుందని అందుకే ట్రంప్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతూ హడావుడి చేస్తున్నారని అంటున్నారు. మస్క్ కూడా క్విడ్ ప్రో కోకు పాల్పడతానని చెప్పట్లేదు కానీ.. ట్రంప్ వస్తేనే స్పేస్ బిజినెస్ మరింత ఎక్కువగా సాగుతుందని అంటున్నారు.
మొత్తంగా మస్క్ మాత్రం ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ తన ఫ్లాట్ ఫాం ఎక్స్ ను పూర్తి ట్రంప్ కోసం వినియోగిస్తున్నారు. తాను కూడా అదే పని చేస్తున్నారు. ట్రంప్ కోసం పని చేసే వాళ్లకు రోజుకు డ్రా తీసి మిలియన్ డాలర్లు ఇస్తున్నారు. చట్ట విరుద్ధమైనప్పటికీ చాలా పనులు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇంతా చేసి విశేషం ఏమిటంటే.. ట్రంప్ జన్మతహా అమెరికన్ కాదు. ఆయన సౌతాఫ్రికాలో పుట్టి కెనడాలో గడిపి.. ఆ తర్వాత అమెరికా చేరుకున్నారు.