యలహంకలో ఇరవై ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ అసలు జగన్ ది కాదు. దాన్ని వైఎస్ హయాంలోనే షర్మిలకు ఇచ్చారు. వైఎస్ సీఎం అయిన తర్వాత జగన్ రెడ్డి కుప్పలు, తెప్పలుగా కూడబెట్టుకున్న ఆస్తుల్లో యలహంక ప్యాలెస్ కూడా ఒకటి. ఆ ప్యాలెస్ వైభోగం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ ప్యాలెస్ ను ఇప్పుడు జగన్ వదిలి పెట్టడం లేదు. వారానికి నాలుగు రోజులు అక్కడ ఉంటున్నారు. ఇలా ఎందుకు అనేది చాలా మందికి సస్పెన్స్ గా ఉంది. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరపడింది.
ఆ యలహంక ప్యాలెస్ తన వాటాగా ఆస్తిలో వచ్చిందని షర్మిల స్పష్టం చేయడంతో జగన్ రెడ్డి ఆమె ఎక్కడ ఆ ఇంట్లో మకాం వేస్తుందోనన్న భయంతోనే ఆ ప్యాలెస్ లో వారానికి నాలుగు రోజులు ఉంటున్నారు. తాను ఆ ఇంటికి వెళ్లడం ప్రారంభించిన తర్వాత తన కుటుంబసభ్యులు అయినా సరే ఎవరూ రాకుండా సెక్యూరిటీని పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. మమూలుగా అయితే జగన్ రెడ్డి హైదరాబాద్ లో మకాం వేయాలి. కానీ అక్కడ షర్మిలకు ఇప్పటికే సొంత ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా వైఎస్ చనిపోయిన తరవాతే నిర్మించారు.
జగన్ రెడ్డికి ఎంత భయం అనేది ప్రస్తుతం యలహంక ప్యాలెస్ విషయంలో ఆయన పడుతున్న జాగ్రత్తతోనే అర్థమవుతుంది. అక్రమాస్తులు అవకాశం దొరకగానే ఇష్టం వచ్చినట్లుగా కూడబెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి సొంత కుటుంబంపై యుద్ధం చేయాల్సి వస్తోంది. అందుకే పాపపు సొమ్ము సంపాదించడమే పెద్ద శిక్ష అంటారు పెద్దలు.