రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు రాజ్. మారుతి సమర్పణలో వచ్చిన సినిమా ఇది. స్టొరీ ఐడియా కూడా ఆయనిదే. కానీ ఆ ఐడియా తెరపైకి ఎఫెక్టివ్ గా రాలేదు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీనికి తోడు మత్తువదలరా2 కి హిట్ టాక్ రావడంతో భలే ఉన్నాడేని ఆడియన్స్ లైట్ తీసుకున్నట్లుగానే కనిపించారు. థియేటర్స్ ఫుట్ ఫాల్ చూస్తుంటే అలానే వుంది.
మారుతి బ్రాండ్ తో వచ్చిన సినిమా ఇది. మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్ చేస్తున్నారు. మారుతిని అనుకొని వుంటే ప్రభాస్ తో ఈ సినిమా ఏదో రకంగా ప్రమోషన్ చేసి ఉండొచ్చు. కానీ ఆయన ఆ ఛాయిస్ తీసుకోలేదు. మారుతి ఐడియా అయినప్పటికీ అది స్క్రీన్ మీదకి బలహీనంగా వచ్చింది. ఆయనకి సినిమా రిజల్ట్ ముందే తెలుసేమో. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా సినిమాని వదిలారు. సినిమా ఎలా వున్నా సక్సెస్ మీట్ పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ సినిమా విషయంలో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా వద్దని బలంగా చెప్పేశారట మారుతి. మొత్తానికి ఈ ఫ్లాప్ ప్రభావం తనపై పడకుండా మారుతి తప్పించుకొన్నా, రాజ్ తరుణ్ బ్యాడ్ టైమ్ కి మాత్రం ఆయన కూడా ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు.