జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కొద్ది రోజులుగా.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. అదీ కూడా.. ఓ రేంజ్ లో .. విమర్శలు గుప్పిస్తున్నారు. మగతనం లేదా.. అని.. మండి పడుతున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా… రోడ్ల మీద తిరుగుతున్నారని.. పదే పదే విమర్శిస్తున్నారు. నిన్నామొన్నటిదాకా.. జగన్మోహన్ రెడ్డి గురించి… సాఫ్ట్‌గా మాట్లాడి.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు ఇలా పవన్ రివర్స్ అయ్యారనేది చాలా మందికి అర్థం కాలేదు కానీ.. అసలు విషయం మాత్రం “ఈగో” అంటున్నారు.. జనసేనలో పవన్ కల్యాణ్‌ను దగ్గర నుండి చూసిన నేతలు. ఖుషీ సినిమాలో “ఈగో” ఫ్యాక్టర్ ఎంత బలంగా ఉందో.. అది పవన్ కల్యాణ్ లో కూడా అలాగే ఉందంటున్నారు. ఆ “ఈగో”లో జగన్మోహన్ రెడ్డి తనను ఖాతరు చేయకపోవడం.
పవన్ కల్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకూ.. చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడారు. మాట్లాడిన రెండు మూడు సార్లు.. చాలా తేలికగా.. ఆయనో లీడర్ కాదన్నట్లుగా… “సినిమా తక్కువ.. ఇంటర్వెల్ ఎక్కువ”, “కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడని..” తేలిగ్గా తీసి పడేసి.. వెళ్లిపోయారు. ఇక బహిరంగసభల్లో… ప్రతి పదానికి ముందో సారి… చివరో సారి.. చంద్రబాబు అంటారు. గంట మాట్లాడితే. గంట సేపు.. చంద్రబాబును విమర్శిస్తారు.. కానీ ఎక్కడా పవన్ కల్యాణ్ ను గుర్తించే ప్రయత్నం చేయరు. గుర్తు చేసి విమర్శించే ప్రయత్నం అసలే చేయరు. ఇదే పవన్ కల్యాణ్ లో పట్టుదల పెంచిందంటున్నారు. జగన్ ను.. టార్గెట్ చేస్తే.. తన గురించి జగన్ ఎందుకు మాట్లాడరో చూస్తానని.. పవన్ కల్యాణ్ జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారంటున్నారు.
అందుకే జగన్మోహన్ రెడ్డిని.. రెచ్చగొట్టేందుకు.. తనను ఆయన విమర్శించేలా చేసుకునేందుకు పవన్ కల్యాణ్ తన అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. జగన్ అవినీతి చరిత్ర గురించి చెప్పారు. కోడి కత్తి డ్రామాలను గేలిచేశారు. ఇవన్నీ వర్కవుట్ కాకపోవడంతో… చివరికి గతంలో ఏ అంశంలో అయితే.. తనను విమర్శించారో.. అదే అంశం…అంటే.. అసెంబ్లీ బహిష్కరణ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. చేయాల్సినన్ని విమర్శలు చేశారు. అయినప్పటికీ.. స్పందన లేదు. అందుకే జగన్ పై తన విమర్శల వాడిని పెంచుకుటూనే పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి .. తనను గుర్తించి.. విమర్శలు చేసే వలకూ.. పవన వదిలి పెట్టే అవకాశమే లేదంటున్నారు.. జనసేన వర్గీయులు. గతంలో.. పవన్ ఎవరో తెలియదన్నందుకు.. అశోక్ గజపతి రాజుపై.. జనసేనాని ఎన్ని విమర్శలు చేశారో.. అందరికీ గుర్తుండే ఉంటుంది.. !