హీరోయిన్ పూనంకౌర్.. ట్వీట్ చేసినా.. పర్సనల్‌గా ఎవరినైనా కలిసినట్లు బయటకు వచ్చినా…. అది హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిశారు. కాసేపు చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశం రహస్యంగా జరిగింది. మీడియాకు తెలియనివ్వలేదు. కానీ డీజీపీతో పూనంకౌర్ సమావేశానికి సంబంధించి తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని సేకరించింది. దాదాపుగా అరగంట సేపు… పూనంకౌర్.. డీజీపీ మహేందర్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం.
కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించినందుకు ఆమె మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడానికి కలిశారని.. పూనంకౌర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. గతంలో పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ.. కత్తి మహేష్..మీడియాలో రచ్చ చేసినప్పుడు.. పూనంకౌర్.. కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. అవి కత్తి మహేష్‌ను ఉద్దేశించి అన్నట్లే ఉండటంతో.. ఆయన పూనంకౌర్‌పై కూడా ఆరోపణలు చేశారు. పూనం – పవన్‌లకు కలిపి అనేక ఆరోపణలు చేశారు. దీంతో పూనం అప్సెట్ అయ్యారు. ఈ వివాదం నుంచి తనను కాపాడాలని.. సోషల్ మీడియాలో పవన్‌కు మొరపెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ట్వీట్‌ను తొలగించారు.
ఆ తర్వాత కత్తి మహేష్‌కు కూడా ఆ వివాదాన్ని అంతటితో వదిలి పెట్టారు. కానీ.. పూనంకౌర్ మాత్రం.. కొత్త వెర్షన్లో తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ వస్తున్నారు. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో స్పష్టంగా చెప్పకుండా.. హింట్లు ఇస్తూ.. ట్వీట్లు పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఓ న్యూస్చానల్కి ఇచ్చిన ఇంటర్యూలో కూడా.. తనకు అన్యాయం చేసిన వారిని ఎప్పటికైనా వదిలి పెట్టబోనని చెప్పుకొచ్చారు. దాంతో ఇప్పుడు పూనంకౌర్.. కొత్తగా ఏదైనా పోరాటం మొదలు పెట్టబోతున్నారా…? దానికి సంబంధించి.. ఫ్యాన్స్ పేరుతో తనపై ఎవరైనా దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి.. రక్షణ కోసం… పోలీసుల వద్దకు వెళ్లారా అన్న చర్చ ప్రారంభమయింది.