ఈరోజుల్లో ప్రతీ హీరో పేరుకు ముందు ఓ బిరుదు చేరిపోవడం కామన్ అయిపోయింది. ఆఖరికి సంపూర్ణేష్ బాబు కూడా బర్నింగ్ స్టార్ అనే బిరుదుతోనే పుట్టాడు. అల్లరోడు..సడన్ స్టార్ అయిపోయాడు. అలానే నానికి నేచురల్ స్టార్ అని పిలవడం మొదలెట్టారు. భలే భలే మగాడివోయ్ టైటిల్ కార్డులో నాని పేరుకు ముందు నేచురల్ స్టార్ అని పడింది. అదంతా మారుతి ఆలోచనేనట. నిజానికి తన పేరు ముందు ఎలాంటి బిరుదులూ పెట్టొద్దని నాని గట్టిగా చెప్పినా.. మారుతి వినలేదట. తెరపై నేచురల్ స్టార్ నాని అని పడగానే.. థియేటర్లో జనాలంతా నవ్వారని.. అది తనకు బాగా నచ్చిందని, అందుకే దాన్ని కంటిన్యూ చేయించేశాడని నాని చెబుతున్నాడు.
”నాకు ఇలాంటి బిరుదులు ఇష్టం ఉండదు. ఏం సాధించామని.. ఇలా పేర్లు పెట్టుకొని పిలవడం. ఇదే విషయం మారుతిగారికి చెప్పా. కానీ ఆయన వినలేదు. తెరపై నా పేరు అలా చూసుకొంటే నాకే నవ్వొచ్చింది. ప్రేక్షకులూ నవ్వారు. ఎవరూ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కాబట్టి.. ప్రాబ్లం లేదనిపిస్తోంది” అంటున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన జెంటిల్మెన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతో నాని కెరీర్ ఏ రేంజుకి వెళ్తుందో చూడాలి.