కొడాలి నాని.. వల్లభనేని వంశీ…ఫైర్ బ్రాండ్ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలపై చెలరేగిపోయిన వీరిద్దరూ .. కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి కావొస్తున్నా ఈ ఇద్దరూ చంద్రబాబు పాలనపై ఎక్కడా వ్యాఖ్యలు చేయడం లేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దీ రోజులు సైలెంట్ గానే ఉన్నా కొడాలి నాని..ఆ తర్వాత ప్రభుత్వంపై పోరాటం చేస్తామని.. ఈ విషయంలో వెనక్కి తెగ్గేదేలే అంటూ వ్యాఖ్యానించడంతో మునుపటి దూకుడు కనబరుస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత జగన్ తో అక్కడక్కడ కనిపించినా మీడియాకు దూరంగానే ఉన్నారు. ఇటీవల విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ రెండుసార్లు పర్యటించినా వీరు ఎక్కడా భాగస్వామ్యం కాలేదు. ప్రభుత్వంపైన విమర్శలూ చేయలేదు.
అయితే, ఈ ఇద్దరి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిపై పలు కేసులు ఉండటంతో కొంతకాలం మౌనంగా ఉండాలని జగన్ ఆదేశించారని..సదరు నేతలూ అరెస్ట్ భయంతో ఉండటంతో మౌనాన్ని ఆశ్రయించారనే చర్చ నడుస్తోంది. కాగా, వల్లభనేని వంశీ అయితే ఎక్కడ ఉన్నారో ఎవరికీ క్లారిటీ లేదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన అరెస్ట్ తప్పదని తేలడంతోనే విదేశాలకు పారిపోయినట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి ఈ ఇద్దరి ఫైర్ బ్రాండ్ నేతల వ్యవహారం మాత్రం వైసీపీలో చర్చనీయంశంగా మారింది.