కణం షూటింగ్ సందర్భంగా నాగశౌర్య – సాయి పల్లవి మధ్య లుకలుకలు జరిగాయి. సాయి పల్లవి డామినేషన్ తట్టుకోలేని శౌర్య… సెట్లోనే ఆమెతో గొడవ పడినట్టు వార్తలొచ్చాయి. మీడియా ముందు కూడా సాయి పల్లవి గురించి కొన్ని నెగిటీవ్ కామెంట్లు చేశాడు. సాయి పల్లవి హీరోల్ని కూడా డామినేట్ చేస్తుందని, తన పాత్ర బాగుంటే చాలనుకుంటుందని.. సాయి పల్లవిని డైరెక్ట్ గానే ఎటాక్ చేశాడు. వీటిపై సాయి పల్లవి కూడా స్పందించింది. కాకపోతే… బాగా పాజిటీవ్‌గా. శౌర్య అలా ఎందుకు అన్నాడో తనకు అర్థం కాలేదని, శౌర్య మంచినటుడని, తనని ఇబ్బంది పెట్టుంటే క్షమించమని చెప్పుకొచ్చింది. శౌర్య కామెంట్లు తనని బాధించాయని, సారీ చెప్పడానికి ఫోన్ చేసినా శౌర్య స్పందించలేదని చెప్పింది సాయి పల్లవి.
వీటిపై ఇప్పటి వరకూ నాగశౌర్య నోరు విప్పలేదు. సాయి పల్లవి ఓ మెట్టు దిగొచ్చింది కాబట్టి…. శౌర్య కూడా కాస్త పాజిటీవ్ గా స్పందించి ఉంటే బాగుండేదని ఇండ్రస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. కేవలం సాయి పల్లవిపై కోపం వల్లనే… ‘కణం’ ప్రమోషన్లకు నాగశౌర్య డుమ్మా కొట్టాడని నిర్మాతలు తెగ బాధపడిపోతున్నారు. ‘ఛలో’ తరవాత నాగశౌర్య నుంచి వస్తున్న సినిమా ఇది. కనీసం తన ఫామ్ ని నిలుపుకోవడానికైనా… ప్రమోషన్లతో కాస్త కష్టపడాల్సింది. కథానాయికపై కోపంతో… ఓ నిర్మాతని ఇబ్బందుల్లో నెట్టడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.