జగన్ రెడ్డిని నమ్ముకుని నిండా మునిగిపోయనని బాలినేని బాధపడుతున్నారు. ఆ బాధలో అన్నీ బయటకు చెప్పేస్తున్నారు. తాను అవినీతికి పాల్పడ్డానని బెట్టింగ్లు కాశానని అవసరం లేకపోయినా చెబుతున్నారు. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో తానే కాదు జగన్ రెడ్డి కూడా గెలిచే అవకాశం లేదని చెబుతున్నారు. తన కుమారుడికి జగన్ పై ఎంతో అభిమానం ఉంది కానీ.. జగన్ రెడ్డికి మాత్రం లేదంటున్నారు.
బాలినేని మాటల ప్రకారం చూస్తే.. జగన్ రెడ్డి పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలు అంచనాకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ కూడా ఇవ్వరని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అది నిజమని ఆయన మాటల ద్వారానే తెలుస్తోంది.కొంత కాలంగా ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితో ఒకప్పుడు వర్గపోరు ఉండేది. మంత్రి పదవి పోయాక.. ఆయనతో రాజీ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ టీడీపీలో తీసుకుంటే.. మాగుంటను తీసుకుంటారు కానీ బాలినేని తీసుకోకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బాలినేని ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని సులువుగానే అర్థమవుతోందని.. ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. జగన్ రెడ్డి . నిరాదరణ , రాజకీయ భవిష్యత్ పై గందరగోళం.. తన కుమారుడు నిర్వాకాలు.. ఆయన రాజకీయ భవిష్యత్ పై బెంగతో… బాలినేని ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితికి వెళ్లిపోతున్నారని అంటున్నారు .