చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో పోటీ చేశారు. అసలు ఆయనకు ఒంగోలుకు సంబంధమేంటో వైసీపీ నేతలకూ అర్థం కాలేదు. బాలినేనికి కూడా అదే డౌట్ వచ్చింది. కానీ ఎక్కువ మాట్లాడితే తన సీటు కూడా ఉండదని క్లారిటీ రావడంతో ఏదో ఒకటి ఊరుకున్నారు. కానీ చెవిరెడ్డి ఒంగోలుకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆర్టీసీ స్థలం కొట్టేయడం.
ఎన్నికలకు నెల రోజుల ముందే ఒంగోలులో ఆర్టీసీ స్థలాన్ని లీజు పేరుతో తన కుమారుడి పేరుతో రాయించుకున్నారు చెవిరెడ్డి. దానికి టెండర్ పేరుతో నాటకమాడారు. టెండర్ వచ్చేసిది. వెంటనే ఓ ప్రైవేటు మాల్తో ఒప్పందం చేసుకుని పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు విషయం బయటకు తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముసుగులో ఒంగోలును కబ్జా చేయడానికే చెవిరెడ్డి వచ్చాడా అని నోరెళ్లబెడుతున్నారు.
ఇప్పుడు టీడీపీ నేతలు మొత్తం ఆర్టీసీకి ఉన్న ఆస్తులు ఎక్కడెక్కడ వైసీపీ గ్యాంగ్ లీజుకు తీసుకుందో బయటకు తీయడం ప్రారంభించారు. చెవిరెడ్డి దందా ఇంకా చాలా చోట్ల ఉందని బయటపడుతోంది. ఓ ప్రైవేటు మాల్ తో ఒప్పందాలు చేసుకుని ఆర్టీసీ స్థలాలను సొంతం చేసుకుని అడ్డుగోలుగా ఆస్తుల్ని పెంచేసుకుందామనుకున్నారు చెవిరెడ్డి. ఇప్పుడీ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం పదిహేడు చోట్ల ఆర్టీసీ స్థలాల్ని లీజు పేరుతో కబ్జా చేసినట్లుగా అనుమానాలు వస్తున్నాయి.
వైసీపీ హయాంలో ఖరీదైన ప్రభుత్వ స్థలాల్ని లీజుల పేరుతో వైసీపీ నేతలు .. తమ పేర రాయించుకోవడం అనేది ఓ రెగ్యూలర్ ప్రాక్టీస్ లా మారిపోయింది. వైసీపీ పార్టీ ఆఫీసులు కూడా లీజుకు తీసుకున్నవే. వందల కోట్లు విలువ చేసేవే. చెవిరెడ్డి వంటి వందిమాగధులు చేసిన లీజుల కబ్జాల గురించి ముందు ముందు సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.