సంచలనం సృష్టించిన ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో.. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు మొదటి నుంచి.. మీడియాలో.. .హైలెట్ కావడానికి ప్రధాన కారణమైన జయరాం మేనకోడలు శిఖాచౌదరిని సాక్షిగా మాత్రమే పేర్కొన్నారు. ఆమెకు.. జయరాం హత్యకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. 11వ నెంబర్ సాక్షిగా శిఖా చౌదరి.. పదమూడో నెంబర్ సాక్షిగా .. ఆమె బాయ్ ఫ్రెండ్ సంతోష్ ఉన్నారు. హత్య జరిగిన రోజున.. ఆమె.. సంతోష్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
శిఖా చేసిన అప్పులే జయరాం హత్యకు కారణం..!
అసలు ఈ స్టోరీలో ట్విస్ట్.. ఏమిటంటే.. జయరాం హత్యకు ప్రధాన కారణం.. శిఖా చౌదరినే. కానీ ఆమెకు.. ఇందులో ప్రత్యక్ష భాగస్వామ్యం లేదు. ఆమె చేసిన అప్పును తీర్చేందుకు అంగీకరించిన జయరాం.. అవి తీర్చలేక.. రాకేష్ రెడ్డి చేతిలో హత్యకు గురైనట్లు.. పోలీసులు తేల్చారు. రాకేష్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో… శిఖా చౌదరి.. నాలుగున్నర కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. అయితే.. ఆ తర్వాత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ.. రాకేష్‌ను.. శిఖా దూరం పెట్టింది. దాంతో.. తను ఖర్చు పెట్టిన మొత్తం ఇవ్వాలని రాకేష్ వేధింపులకు దిగాడు. చివరికి శిఖాకు.. జయరాం కొనిచ్చిన బీఎండబ్ల్యూ కారును… తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం.. జయరాం వద్దకు చేరడంతో.. ఆ సొమ్మంతా తాను చెల్లించేందుకు అంగీకరించాడు. చెల్లించకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విధంగా జయరాం హత్యకు శిఖా కారణం అయింది.
చిత్రహింసలు పెట్టి వీడియోలు తీసిన రాకేష్ రెడ్డి..!
హనీ ట్రాప్‌తో జయరాంను రప్పించి… చిత్ర హింసలకు గురి చేసి.. పిడిగుద్దులు గుద్ది మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్టు తేలింది. రాకేష్ రెడ్డి.. జయరాంను హత్య చేసేటప్పుడు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. చిత్రహింసలు పెడుతూ.. వీడియోలు కూడా చిత్రీకరించాడు. మొత్తం 11 వీడియోలు, 13 ఫొటోలను నిందితులు తీశారు. హాస్పటల్‌కు తీసుకు వెళ్లమని రాకేష్‌ను జయరాం ఎంతగానో ప్రాధేయపడినట్టు ఆ వీడియోల్లో ఉన్నట్లు పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. ప్రతినెలా రూ.50 లక్షలు ఇస్తానని, డాక్యుమెంట్సు, పాస్ పోర్టు రాకేష్ దగ్గరే పెట్టుకుని తనను ప్రాణాలతో వదిలెయ్యాలని జయరాం బతిమలాడారు. హత్య తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు… ముగ్గురు పోలీసులు సహకరించారు. వారి ముగ్గుర్నీ నిందితులుగా చేర్చారు.
మహిళ పేరుతో హనీ ట్రాప్‌కు పాల్పడింది నటుడు సూర్య..!
హనీట్రాప్‌కు పాల్పడిది.. నటుడు సూర్యనే. పలు సినిమాల్లో… సహాయపాత్రలు వేస్తూ.. నటుడిగా రాణిస్తున్న సూర్య… జయరాంపై హనీట్రాప్ కు పాల్పడ్డాయి. యువతిగా నటిస్తూ.. మహిళ గొంతుతో పిలిపించి.. రాకేష్ రెడ్డికి పట్టుబడేలా చేశాడు. దాంతో అతన్ని ఏ-5 నిందితుడిగా చేర్చారు.