పుష్ప 2 విషయంలో చివరి నిమిషంలో చేసిన ఓ కీలకమైన మార్పు టాలీవుడ్ ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత తమన్, అజనీష్, శ్యామ్ సి.ఎస్లకు అప్పగించారు సుకుమార్. సడన్ గా దేవిని తప్పించడం చాలామందికి నచ్చలేదు. పాటల బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ ది అని, ఆర్.ఆర్ అందించే పని ఈ ముగ్గురు సంగీత దర్శకులూ తీసుకొన్నారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. సుకుమార్ – దేవిశ్రీలది గొప్ప అనుబంధం. ఆర్య నుంచి పుష్ప వరకూ ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. దేవి లేకపోతే నేను లేను అని చాలాసార్లు సుకుమార్ చెప్పారు. అలాంటిది సడన్ గా ఈ నిర్ణయం ఏమిటని చాలామంది విస్తుపోయారు. అయితే ఆర్.ఆర్ పని పూర్తి చేయడానికి తగినంత సమయం లేదని, అందుకే మిగిలిన సంగీత దర్శకుల సహకారం తీసుకోవాల్సివచ్చిందని సర్దిచెప్పుకొన్నారు.
లేటెస్టుగా కంగువా సినిమా, ఈ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన నేపథ్య సంగీతం చూస్తే.. సుకుమార్ నిర్ణయం ఏమాత్రం తప్పు కాదన్న భావన కలుగుతోంది. కంగువా చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు. పాటలు ఓకే. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బీభత్సంగా ఉంది. అవసరానికి మించిన దరువుతో థియేటర్లలో సౌండ్ పొల్యూషన్ తెప్పించాడు దేవి. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీంతంలో క్వారిటీ కనిపిస్తుంది. సౌండ్ డిజైనింగ్ బాగుంటుంది. అవి రెండూ కంగువాలో లేవు. దేవికి తగినంత సమయం ఇవ్వకపోతే వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందో చెప్పడానికి కంగువా ఓ తాజా ఉదాహరణ. సుకుమార్ తన టెక్నీషియన్లకు అట్టే టైమ్ ఇవ్వడు. పుష్ప 2 నేపథ్య సంగీతం కోసం దేవిపై ఒత్తిడి తీసుకొస్తే… కచ్చితంగా అనుకొన్న అవుట్ పుట్ రాదు. అందుకే తెలివిగా దేవిని పక్కన పెట్టి, ఆ బాధ్యత తమన్ లాంటివాళ్లకు ఇచ్చాడు సుకుమార్. నిన్నటి వరకూ సుకుమార్ నిర్ణయాన్ని తప్పుబట్టిన వాళ్లు సైతం ఇప్పుడు సుకుమార్ చేసిందే కరెక్ట్ అంటున్నారు. లెక్కల మాస్టార్ లెక్క వేశాడంటే.. తప్పెలా అవుతుంది? కాబట్టి దేవిని పక్కన పెట్టడంలోనూ సుకుమార్ లాజికల్ గా కరెక్టే.