బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూస్తూంటే వైసీపీలోని కీలక నేతలకు కూడా అయ్యో పాపం అనే మాట అనాలిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రి. ఆయన ప్రకాశం జిల్లాలో కీలక నేతగా చక్రం తిప్పారు. అప్పట్లో వైవీ సుబ్బారెడ్డిని రాజకీయంగా దూరంగా ఉంచారు. రాజకీయాల్లో జోక్యం చేసుకునే అవకాశం కల్పించలేదు. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. బాలినేని రాజకీయాల్లో మంచి పట్టు సాధించినా సుబ్బారెడ్డి సాయంతో ఆయనను మెల్లగా పక్కన పడేయడం ప్రారంభించారు. చివరికి నిర్వీర్యం చేసినంత పని చేశారు.
జగన్ సీఎం అయ్యాక బాలినేనికి ప్రాధాన్యత వస్తుందని అనుకున్నారు. అన్నట్లుగానే మంత్రి పదవి ఇచ్చారు. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ.. ఆయనను పక్కన పెట్టడం ప్రారంభించారు. బాలినేనికి ఈ సారి మొండి చేయి చూపాలని ఎప్పుడో డిసైడయ్యారు. కానీ ఓ గేమ్ ప్లే చేస్తున్నారు. ఇదిగో అదిగో అని చెప్పి పక్కన పెడుతున్నారు. క్యాంప్ ఆఫీస్కు పిలిపించి ఐఏఎస్ ఆఫీసర్ అయిన ధనుంజయ్ రెడ్డితో ఎన్ని సార్లు అవమానకరంగా మాట్లాడించారో బాలినేనికే తెలుసు. పిలిచి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా పంపేసిన రోజుల గురించీ తెలుసు.
బాలినేనిని పొమ్మనకుండా పొగపెడుతున్న తరహాలో జగన్ వ్యవహారిస్తూండటం పార్టీలోనే కాదు వైసీపీ లోనూ చర్చ జరుగుతోంది. మెల్లగా షర్మిల వెపు నెట్టేస్తున్నారా లేకపోతే తల్లి తరపు బంధువు ్ని నిరాదరణ చూపిస్తున్నారా అన్నదానిపై ఆ పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు. ఓ వైపు వైవీ సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చినా బాలినేనిని మాత్రం దూరం చేసుకునేందుకు ఎందుకు జగన్ అడుగులు వేస్తున్నారన్నది కూడా అంచనా వేయలేకపోతున్నారు.