మహానగరం హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లు చాలా.. చాలా తక్కువ. విద్యావంతులు, ఉద్యోగులు.. ఇలా అన్ని రకాలుగా.. సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్లు… ప్రజాస్వామ్యం పట్ల… అంతో ఇంతో నమ్మకం ఉన్న వాళ్లు ఎక్కువగా ఉండే నగరం అది. అలాంటి చోట… పోలింగ్ పర్సంటేజీ… 40 శాతానికి అటూ ఇటుగా ఉండటం.. కచ్చితంగా ప్రమాదకర సంకేతమే. అయితే… ఇంత పెద్ద మొత్తం ఓటర్లు ఓటింగ్ కు ఎందుకు దూరంగా ఉంటారు.. అనే సందేహం సహజగంగానే రావాలి. దీని ప్రకారం చూస్తే.. సిటీలో ఉండి కూడా… ఓటు వేయకుండా ఉండేవాళ్లు చాలా తక్కువ. దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న వారిలో ఓటు వినియోగించుకోని వారిని అడిగితే… తనకు ఓటు లేదనో…. మరో కారణమో చెబుతారు కానీ.. ఉండి కూడా.. వినియోగించుకోలేదని చెప్పేవారు మరీ తక్కువ.
హైదరాబాద్ లో స్థిరపడినప్పటికి.. సొంత ప్రాంతాల్లోనే ఓటు హక్కు ఉండేలా చూసుకున్నారు. అది తెలంగాణ అయినా.. ఏపీ అయినా…. తమ తమ ఊళ్లలో ఓటు వేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అలాంటి వారిలో అత్యధికులకి డబుల్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణకు చెందిన వారు… హైదరాబాద్ లో ఉన్నప్పటికీ.. ఊళ్లకి వెళ్లి ఓట్లు వేశారు. ఇక ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి.. ఈ సారి ఓ ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. తమ ప్రాంతం… తమ ఆత్మగౌరవం అనే భావన ఉంది. అందుకే హైదరాబాద్ లో కాదు… వెళ్లి సొంత ప్రాంతంలో ఓటు వేయాలన్న సంకల్పం చూపించారు. ఫలితంగా… ఒక్క హైదరాబాద్ నుంచే పది లక్షల మంది ఓటర్లు… ఏపీకి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి.
హైదరాబాద్ లో ఇప్పుడే కాదు.. ఎప్పుడూ.. యాభై శాతానికి పోలింగ్ మించదు. ఇప్పుడు మరీ తగ్గిపోయింది. గతంలో.. విశాలాంధ్రప్రదేశ్ అన్న భావనతో… హైదరాబాద్ లో ఓటు వేసేవారు. కానీ.. ఈ సారి ఏపీ ఓటర్లు ఏపీకే ప్రాధాన్యం ఇవ్వడంతో.. మొత్తానికే తేడా వచ్చేసింది. అదే సమయంలో… తెలంగాణ రాజకీయ పరస్థితులు కూడా…. ఓటింగ్ శాతానికి తగ్గడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా….. టీఆర్ఎస్ లో చేరిపోతున్నరనే పరిస్థితి ఉండటంతో.. ఎవరికి ఓటేస్తే ఏమిటన్న ప్రశ్న… వస్తోంది. అందుకే చాలా మంది… ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ ఓటింగ్ పై ప్రభావం పడింది.