లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నారు. 27 నుంచి ఆయన పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్రకు రెడీ అయ్యారు. అంతే ప్రభుత్వానికి వణుకు పట్టుకుంది. వాటిని ఎలా ఆపాలా అనుకుంది. ఉత్తర్వులు జారీ చేసేసింది. ఏపీ వ్యాప్తంగా రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలకు అనుంతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. 160 ఏళ్ల కిందట బ్రిటిష్ కాలంలో పెట్టిన 1861 పోలీస్ చట్టం ప్రకారం హోంశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
రోడ్లపై ర్యాలీల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నిషేధం !
కందుకూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపి ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు రాజకీయ సభలు పెట్టుకోకుండా నిషేధం విధించింది. రోడ్లపై ర్యాలీలు. కారణంగా ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా నిర్వహణ లోపాలతో ప్రజలు బలవుతున్నారని అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రవ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్లు ప్రజల రాకపోకలకు, సరకు రవాణాకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం చెబుతోంది.
పోలీసుల ప్రత్యేక పర్మిషన్ ఇవ్వొచ్చు.. వైసీపీ నేతలకే ఆ ఆప్షన్ !
అయితే ఇది ప్రతిపక్షాలకు మాత్రమే వర్తిస్తుంది. అధికారపక్షం మాత్రం ఎలాంటి సమావేశాలనైనా నిర్వహించుకోవచ్చు. దానికి కూడా ఉత్తర్వుల్లో వెసులుబాటు కల్పించరుకున్నారు. అత్యంత అరదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సంతృప్తి చెందితే పర్మిషన్ ఇవ్వొచ్చునని చెప్పుకొచ్చారు. ఆ పర్మిషన్లు వైసీపీ నేతలకే ఇస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను పెంచుకుంటున్నాయి.త ప్రజలతో సభలు, సమావేశాలు పెట్టుకుంటూ ఉంటాయి. అయితే ప్రభుత్వ ఈ ప్రజాస్వామ్య హక్కునూ కాలరాస్తోంది.
కందుకూరు, గుంటూరు ఘటనల వెనుక లోకేష్, పవన్ యాత్రలను ఆపే మాస్టర్ ప్లాన్ ఉందా ?
కందుకూరు, గుంటూరు ఘటనలు వరుసగా జరగడంపై టీడీపీ నేతలు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎప్పుడూ జరగని ఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయని .. దీనిపై సీబీఐ దర్యాప్తు కావాలని అడుగుతున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర ప్రారంభం లోపే ఇలా జరగడం.. ఆ వెంటనే.. పాదయాత్రను అడ్డుకునేలా… పోలీస్ యాక్ట్ ను అమలు చేయడం .. రోడ్లపై ర్యాలీలు వద్దంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో .. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న వాదనకు బలం చేకూరుతోంది.