పేర్ని నాని గోడౌన్ లో రేషన్ బియ్యం అమ్ముకున్నారు . ప్రభుత్వం తమదే కాబట్టి .. తమ యజమాని జగన్ రెడ్డి ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారు కాబట్టి ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని కొట్టేశారు. అయితే బయటపడేసరికి ఆయన డబ్బులు కట్టారు. ఎందుకు ఇంత హడావుడిగా డబ్బులు కట్టారో చాలా మందికి అర్థం కాలేదు.కానీ దోచేసిన దాంట్లో సగమే లెక్కలు చెబితే కట్టేస్తో పోలా అనుకోకుండా ఉంటారా?
పేర్ని నాని ఇప్పటి వరకూ మూడు వేల బస్తాలను మాత్రమే మాయం చేశారని అధికారులు లెక్కలు తేల్చారు. ఆ ప్రకారమే కేసులు పెట్టారు.కానీ ఇపుడు మిస్సయింది ఏడున్నర వేల బస్తాలుగా లెక్క తేలింది. ఈ విషయం ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుందని ఆయన కుటుంబాన్ని తీసుకుని పరారయ్యారు. ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ముందస్తు బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికైతే అరెస్టులు చేయకుండా ఏ కోర్టు ఎలాంటి ఉత్తర్వుల ఇవ్వలేదు. కానీ ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు పెద్దగా ప్రయత్నాలు చేయడంలేదు. ఈ అంశంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడంలేదని టీడీపీ క్యాడర్ అంటోంది. అయితే ప్రభుత్వ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేయాల్సిందే అని చెబితే చేసేవారు.కానీ మొత్తం పోలీసులకే వదిలేశారు. ఎలాంటి సూచనలు,సలహాలు ఇవ్వడం లేదు. దాంతో పోలీసులు పేర్ని నానిని పట్టుకోవడంపై ఆసక్తి చూపించడం లేదు.