పిన్నెల్లికి మంచి చేద్దామని వెళ్లారో.. లేకపోతే రాజకీయం చేద్దామని వెళ్లారో కానీ నెల్లూరు సెంట్ర్ జైలు ముందు ఆయన పెట్టిన ప్రెస్మీట్ కారణంగా పిన్నెల్లికి బెయిల్ నిరాకరించారు. తనకు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. రెండు కేసుల్లో పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే.. జగన్ చేసిన ప్రకటనను ప్రభుత్వం తరపు లాయర్లు ప్రధానంగా ప్రస్తావించారు. జడ్జి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈవీఎంలను పిన్నెల్లి పగులగొట్టారని జగన్ చెప్పారన్నారు.
అయితే కస్టడీలో మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు తాను పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రానికి వెళ్లలేదని చెప్పారు. పిన్నెల్లి చెప్పిన దానికి ఆయన పార్టీ అధ్యక్షుడు జగన్ జైలు ముందు ఇచ్చిన వాంగ్మూలానికి చాలా తేడా ఉంది. పిన్నెల్లి అబద్దాలు చెబుతున్నారని కావాలంటే జగన్ వాంగ్మూలం చూడాలని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి పిన్నెల్లి బెయిల్ పిటిషన్లను కట్టేస్తూ తీర్పు ఇచ్చారు.
ఈవీఎంలను తాను పగులగొట్టలేదన్న వాదనకు ఫిక్సయిపోవాలని పిన్నెల్లి అనుకున్నారు. జగన్ తన పుట్టి ముంచేలా జైలు బయట… తానే ఈవీఎంలను పగులగొట్టానని చెబుతారని ఆయన ఊహించేదు. కానీ చెప్పేశారు. అయినా జైలు బయట కాబట్టి.. పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలం కాదు కాబట్టి.. ఎలాగోలా డిఫెండ్ చేసుకోవచ్చని పిన్నెల్లి అడ్డగోలు వాదనలతో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ జగన్ వల్ల ఆయనకు గట్టి షాక్ తగిలింది.