హైదరాబాద్‌లోని నానాక్‌రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ త్వరలోనే మూతబడనుంది. ఇక నుంచి నానక్ రామ్ గూడా స్టూడియో గత చరిత్రలో కలిసిపోతుంది. అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి, ఫ్లాట్‌ని అమ్ముకోవాలన్న ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు. అందుకూ బలమైన కారణం ఉంది. దాదాపుగా 400 కోట్ల విలువైన ప్రాపర్టీ ఇది. షూటింగుల రూపంలో నెలకు లక్షల్లో కూడా ఆదాయం రావడం లేదని తెలుస్తోంది. దానికి తోడు చుట్టుపక్కల ఎత్తైన భవనాలు వచ్చేశాయి. రామానాయుడులో షూటింగ్ జరుగుతున్నప్పుడు.. పక్క భవనాల నుంచి జనం చూడడం, అక్కడ జరుగుతున్న తతంగం అంతా చుట్టుపక్కల బిల్డింగులలో ఉన్నవాళ్లు సెల్‌ఫోన్స్ లో రికార్డు చేస్తుండడం వల్ల… ప్రైవసీ లేకుండా పోతోందట. రామానాయుడు స్డూడియో లోపలికి వెళ్లడానికి కూడా దారులు సవ్యంగా లేవు. వర్షాకాలం వస్తే.. అక్కడ చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే ఈ స్టూడియో మూసేద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు. అపార్ట్మెంట్ల వల్ల వచ్చిన డబ్బుని… విశాఖలోని రామానాయుడు స్టూడియో ని విస్తరించడం కోసం వాడబోతున్నార్ట. ఇక్కడ రామానాయుడు స్టూడియో లేకపోయినా… విశాఖలో పెద్ద ఎత్తున డవలెప్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నారు సురేష్ బాబు. అందుకే ఇక్కడి స్టూడియోని మూసేస్తున్నారు.