ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం ఏం చెప్పినా చేస్తోంది. విద్యుత్ సంస్కరణలు అమలుచేస్తామని కూడా రాసిచ్చింది. ఆ ఫలితంగా అప్పులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తాజాగా మరో మూడు వేల కోట్లను విద్యుత్ సంస్కరణలు అమలుచేసినందునకు ప్రతిగా తీసుకునేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో కరెంట్ కోతలు హోరెత్తిపోతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వం తీసుకున్న అప్పులకు సంబంధించిన సంస్కరణ వల్లేనని తేలుతోంది.
మోదీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం పాత అప్పు ఉంటే కొత్త అప్పు చేయడానికి వీల్లేదు. దానికి తోడు బకాయిలు ఉంటే విద్యుత్ కొనడానికి వీల్లేదని చట్టంలో ఉంది. రూ. 22 వేల కోట్ల రూపాయలు మూడేళ్లలో తీర్చాలి. ఇవన్నీ సంస్కరణలు. దానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించి అదనపు అప్పుల కోసం సంతకాలు చేసింది. ఈ సంస్కరణల్లో భాగంగానే రైతులకు విద్యుత్ మీటర్లు పెడుతున్నారు. ఈ చట్టం ప్రకారం అప్పుగా విద్యుత్ కొనడానికి వీల్లేదు.. ఎవరైనా ఇస్తామన్నా కూడా కేంద్రం అంగీకరించదు. అప్పుల కోసం ఏపీ పెట్టిన సంతకాల వల్లే ఈ సమస్య వచ్చిందన్నమాట.
ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొందామన్నా కేంద్రం చట్టం కారణంగా ఎవరూ ముందుకు రావడం లేదని మంత్రి పేర్ని నాని చెప్పారు. నిజానికి బహిరంగ మార్కెట్లో అందరికీ అమ్ముతారు. కానీ సంస్కరణలకు ఆమోదం తెలిపిం.. సంతకాలు చేసినందున వాటిని అమలు చేయాల్సిన స్థితిలో ఏపీ ఉంది. ఫలితంగా ఇప్పుడు డబ్బుల్లేక కరెంట్ కొనలేకపోతున్నారు. అంతకు మించి ఏపీ ప్రజలకు నరకం చూపిస్తున్నారు.